Mahesh Babu fans questioning about sithara career
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఈ మధ్య కాలంలో హీరోయిన్ స్థాయిలో సెలబ్రిటీ హోదాని సొంతం చేసుకుంది. యూట్యూబ్లో మరియు ఇంస్టాగ్రామ్ లో ఆమె చేస్తున్న సందడి అంతా ఇంకా కాదు ఏకంగా స్టార్ హీరోయిన్లకు ఉన్నంత ఫాలోయింగ్ ని ఆమె సొంతం చేసుకున్నారు. సర్కారు వారి పాట సినిమా యొక్క ఒక పాట లిరికల్ వీడియోలో కనిపించడం ద్వారా సితార త్వరలోనే సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ఒక క్లారిటీ మహేష్ బాబు ఇవ్వకనే ఇచ్చాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సితార ఏమవుతుంది అనేది తనకు తెలియదని పూర్తిగా తన అభిరుచి ఇష్టంపై ఆధారపడి ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.
తాజాగా కూతురుతో కలిసి జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న ఒక డ్యాన్స్ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరయ్యాడు. ఆ సందర్భంగా కూతురు మరియు మహేష్ బాబు కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ప్రేక్షకులు చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు అంటూ ప్రోమోకే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కార్యక్రమం జీ తెలుగులో ప్రసారం కాబోతుంది. ఆ పూర్తి ఎపిసోడ్ కోసం అభిమానులు మరియు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో మహేష్ బాబుని కొందరు సోషల్ మీడియా ద్వారా బాబు గారు సీతు పాపని ఏం చేయాలి అనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
Mahesh Babu fans questioning about sithara career
ఆమె ఫేస్ చూస్తుంటే ఒక మంచి హీరోయిన్ నటి అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి.. దయచేసి మీరు ఆమెని హీరోయిన్గా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. అయితే సితార వయసు చాలా చిన్నది ప్రస్తుతం ఆమె ఇంకా చదువుతూనే ఉంది. కనుక అప్పుడే హీరోయిన్గా నటించాలి, ఇంకేదో చేయాలి అని ఉద్దేశం ఆమెకు ఉండి ఉండదు. అలాగే మహేష్ బాబుకి ఆలోచన వచ్చి ఉండదు. కనుక ఇప్పటి నుండే ఆ విషయంలో మహేష్ బాబు అభిమానులు అత్యుత్సాహానికి వెళ్లి మహేష్ బాబుని చికాకు పెట్టడం మంచిది కాదు అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందరు బలంగా కోరుకుంటే తప్పకుండా సితార హీరోయిన్ అవుతుందేమో చూడాలి మరి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.