Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఘట్టమనేని నటవారసురాలిగా, మహేష్ బాబు గారాల పట్టీ గా ఇప్పటికే సోషల్ మీడియా లో సితార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సితార ను హీరోయిన్ గా తీసుకొస్తారా..?లేక వేరే రంగంలో తీసుకెళ్తారా..? అనేది అందరి మదిలో ఉండగా, ఇదే ప్రశ్న మహేష్ కి ఎదురైంది. పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్‌ఫార్మెన్స్ గురించి అడగగా “అది థమన్ ఆలోచన. నాకు కూడా తెలియదు. ఇంటికి వెళ్లి నమ్రత కు చెప్పేలోపు అతనే నమ్రతను అడిగేశాడు.”నేను క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉన్నాను.
డైరెక్టర్ వెళ్లి నమ్రతతో మాట్లాడి సితారతో డ్యాన్స్ ఓకే చేసేసారు. నాకు అస్సలు చెప్పలేదు. నా షూటింగ్ అవ్వగానే మూడు రోజుల్లో ఆ పాటని షూట్ చేశారు. తర్వాత వచ్చి చూపిస్తే ఆశ్చర్యపోయాను. తనని చూసి గర్వపడతాను. అయితే ఈ పాట సినిమాలో ఉండదు. ఈ విషయం సితారకి తెలిసి గొడవ పెడుతుంది సినిమాలో ఎందుకు లేదని. భవిష్యత్తులో సితార గొప్ప యాక్ట్రెస్ అవుతుంది” అని తెలిపారు. మహేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో.. ఇప్పుడు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ వారసురాలిగా సితార సినిమాల్లోకి ఎంట్రీ ఖాయం అని సంబరాలు చేసుకుంటున్నారు.మహేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇది వరకు ఆయన ఎన్నోసార్లు బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు.
పాన్ ఇండియా సినిమాల హవా పెరుగుతున్న కమ్రంలో మళ్లీ మరోసారి ఆయనకు బాలీవుడ్ ఎంట్రీ గురించిన ప్రశ్న ఎదురైంది. అయితే తనకు బాలీవుడ్ వెళ్లే ఆలోచన లేదని ఆయన సింపుల్‌గా తేల్చేశారు. ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రం నిడివి కాస్తా ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపుగా 2 గంటల 40 నిమిషాలుగా ఉండనుందట. అంతేకాదు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చిందని తెలుస్తోంది. చిత్రం నుండి విడుదలైన కళావతి సాంగ్‌కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.