Sitara : సితార వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మ‌హేష్ బాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sitara : సితార వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మ‌హేష్ బాబు

 Authored By sandeep | The Telugu News | Updated on :10 May 2022,6:00 pm

Sitara : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట సినిమా ప్రమోష‌న్స్‌లో భాగంగా అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటున్నారు. ఘట్టమనేని నటవారసురాలిగా, మహేష్ బాబు గారాల పట్టీ గా ఇప్పటికే సోషల్ మీడియా లో సితార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సితార ను హీరోయిన్ గా తీసుకొస్తారా..?లేక వేరే రంగంలో తీసుకెళ్తారా..? అనేది అంద‌రి మ‌దిలో ఉండ‌గా, ఇదే ప్ర‌శ్న మ‌హేష్ కి ఎదురైంది. పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్‌ఫార్మెన్స్‌ గురించి అడగగా “అది థమన్ ఆలోచన. నాకు కూడా తెలియదు. ఇంటికి వెళ్లి నమ్రత కు చెప్పేలోపు అతనే నమ్రతను అడిగేశాడు.”నేను క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉన్నాను.

డైరెక్టర్ వెళ్లి నమ్రతతో మాట్లాడి సితారతో డ్యాన్స్ ఓకే చేసేసారు. నాకు అస్సలు చెప్పలేదు. నా షూటింగ్ అవ్వగానే మూడు రోజుల్లో ఆ పాటని షూట్ చేశారు. తర్వాత వచ్చి చూపిస్తే ఆశ్చర్యపోయాను. తనని చూసి గర్వపడతాను. అయితే ఈ పాట సినిమాలో ఉండదు. ఈ విషయం సితారకి తెలిసి గొడవ పెడుతుంది సినిమాలో ఎందుకు లేదని. భవిష్యత్తులో సితార గొప్ప యాక్ట్రెస్ అవుతుంది” అని తెలిపారు. మహేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో.. ఇప్పుడు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ వారసురాలిగా సితార సినిమాల్లోకి ఎంట్రీ ఖాయం అని సంబరాలు చేసుకుంటున్నారు.మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు. ఇది వ‌ర‌కు ఆయ‌న ఎన్నోసార్లు బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు.

Mahesh Babu Gives Clarity On Sitara

Mahesh Babu Gives Clarity On Sitara

Sitara : క్లారిటీ ఇచ్చిన‌ట్టేనా?

పాన్ ఇండియా సినిమాల హ‌వా పెరుగుతున్న క‌మ్రంలో మ‌ళ్లీ మ‌రోసారి ఆయ‌న‌కు బాలీవుడ్ ఎంట్రీ గురించిన ప్ర‌శ్న ఎదురైంది. అయితే త‌న‌కు బాలీవుడ్ వెళ్లే ఆలోచ‌న లేద‌ని ఆయ‌న సింపుల్‌గా తేల్చేశారు. ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రం నిడివి కాస్తా ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపుగా 2 గంటల 40 నిమిషాలుగా ఉండనుందట. అంతేకాదు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చిందని తెలుస్తోంది. చిత్రం నుండి విడుద‌లైన కళావతి సాంగ్‌కి ఎంత రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది