
mahesh babu guntur kaaram dum masala lyrical song release
Guntur Kaaram : గుంటూరు కారం.. ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. ఈ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. మహేశ్, త్రివిక్రమ్ కాంబో కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీళ్ల కాంబోలో 12 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు పూర్తి స్థాయిలో మాస్ మసాలా అవతారంలో కనిపించనున్నారు. సినిమా పేరు కూడా గుంటూరు కారం అని పెట్టడంతో ఈ సినిమా చాలా ఘాటుగానే ఉండేటట్టు ఉంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ధమ్ మసాలా బిరియాని పేరుతో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఈ పాటను సంజిత్ పాడాడు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది. అబ్బో పాట చాలా ఘాటుగా ఉంది అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. జనవరి 12, 2024 లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కూడా ఉంది. మీనాక్షీ చౌదరి కూడా మహేశ్ తో రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాకు చిన్నబాబు, నాగవంశీ నిర్మాతలు. ఈ సినిమా కోసం మహేశ్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.