Guntur Kaaram Movie Trailer : మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ట్రైలర్ విడుద‌ల‌..!

Authored By aruna | The Telugu News | Updated on: January 7, 2024, 9:18 pm
  •  Guntur Kaaram Movie Trailer : మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ట్రైలర్ విడుద‌ల‌..!

Guntur Kaaram Movie Trailer : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మహేష్ బాబు 28వ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరాం కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. ఇక త్రివిక్రమ్ కాంబినేషన్లో అంతకుముందు మహేష్ బాబు ఖలేజా, అతడు సినిమాలు చేశారు. అతడు బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఖలేజా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

అయినా వీరి కాంబినేషన్ కి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు రాబోయే గుంటూరు కారం సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అలాగే ఈ సినిమా నుంచి దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ తో పాటు సెకండ్ సింగిల్ ఓ మై బేబీ లిరికల్ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇటీవల కుర్చీ మడత పెట్టి పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాటలో మహేష్ బాబు శ్రీలీల నెక్స్ట్ లెవెల్ లో డాన్స్ చేశారు. ఇక శ్రీలీల మాస్ డాన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఇప్పటిదాకా జగపతిబాబు రమ్యకృష్ణ పాత్రలను చూపించలేదు. దీంతో ట్రైలర్ లో చూపిస్తారని అంత అనుకున్నారు.

దీంతో ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు ఇవాళ రాత్రి హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో గుంటూరు కారం ట్రైలర్లు లాంచ్ చేశారు. ఎట్టకేలకు గుంటూరు కారం ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ తో మహేష్ బాబు అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp