Home » Entertainment » Mahesh Babu Has Chief Gest For Bigg Boss 4 Grand Finale
Entertainment

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి ఛీఫ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ..!

Authored By
vamana sai
The Telugu News | Published on: December 7, 2020, 9:30 pm
Advertisement

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తుది దశకు చేరుకుంది. టాలీవుడ్ మన్మధుడు.. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇక సీజన్ 4 గ్రాండ్ ఫినాలే కి దగ్గర పడింది. కాగా ఈసారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గ్రాండ్ లెవల్ లో ఉండబోతోంది. ఈ గ్రాండ్ ఫినాలే కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని స్టార్ మా వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Advertisement

గత సీజన్ గ్రాండ్ ఫినాలే కి మెగాస్టార్ చిరంజీవి వచ్చిన సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఎపిసోడ్ లో నాగార్జున – చిరంజీవి కలిసి స్టేజ్ మీద కనిపించగానే ప్రేక్షకుల ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి. ఈ ఎపిసోడ్ కి రేటింగ్ కూడా ఊహించని విధంగా వచ్చింది. అందుకే ఈసారి అంతకు మించి భారీ లేవల్ లో ఉండేలా ప్లాన్ చేసిన బిగ్ బాస్ నిర్వాహకులు సూపర్ స్టార్ మహేష్ ని ఆహ్వానించారని తెలుస్తోంది.

Advertisement

ఇక మహేష్ బాబు కూడా నాగార్జున తో ఉన్న అనుబంధం కారణంగా గ్రాండ్ ఫినాలే కి వచ్చేందుకు ఒప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు. అంతేకాదు మరికొన్ని ఊహించని సర్‌ప్రైజెస్ కూడా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. కాగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అఖిల్ అన్న ప్రచారం జరుగుతోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి