Mahesh Babu : రావ‌ణాసురుడితో యుద్ధానికి సిద్ధ‌మైన మ‌హేష్ బాబు.. ఈ స్కెచ్ అద‌రిపోయిందంతే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : రావ‌ణాసురుడితో యుద్ధానికి సిద్ధ‌మైన మ‌హేష్ బాబు.. ఈ స్కెచ్ అద‌రిపోయిందంతే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 December 2022,7:30 pm

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట చిత్రంతో మంచి హిట్ అందుకోగా, ఈ మూవీ అందించిన ఉత్సాహంతో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 28వ మూవీ చేస్తున్నాడు. .SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న విష‌యం విదిత‌మే. అతడు, ఖలేజా వంటి రెండు సినిమాలు వీరి కాంబోలో రాగా, ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ సాధించ‌డంతో మూడో సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ప్ర‌స్తుతం రెండవ షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుగుతుండ‌గా, డిసెంబ‌ర్ 8 నుండి మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది.ఇక పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుండ‌గా, ఈ సినిమా నుండి మరో రూమర్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించ బోతున్నారు అనే విషయంపై ఇప్పటికే చాలా పేర్లు వినిపించ‌గా, వారిలో సంజయ్ దత్, విక్కీ కౌశల్ వంటి వారు ఉన్నారు. ఇక ఇప్పుడు మరొకరి పేరు కూడా వినిపిస్తుంది మహేష్ బాబు కి విలన్ గా ఈ సినిమాలో ఆదిపురుష్ విలన్ సైఫ్ అలీ ఖాన్ ను తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ న‌డుస్తుంది.

Mahesh Babu is ready to fight with Ravanasura

Mahesh Babu is ready to fight with Ravanasura

Mahesh Babu : ఇది జ‌రిగితే అదుర్స్..!

చిత్రంలో విల‌న్ రోల్ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంది కాబ‌ట్టి, విల‌న్ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ తీసుకోవాల‌ని, ఆయ‌న‌ ఒప్పుకుంటే ఈయననే ఫిక్స్ చేయాలని చూస్తున్నారట.ఇదే నిజం అయితే బిటౌన్ లో కూడా ఈ సినిమా భారీ అంచనాలను అందుకోవ‌డం ఖాయం.ఇక ఈ సినిమాలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ఇప్ప‌టికే ప్రకటించారు. ప‌లు రోజుల చిత్ర షూటింగ్ వాయిదా ప‌డిన నేప‌థ్యంలో చెప్పిన టైంకి మూవీని విడుద‌ల చేస్తారా లేదా అనేది స‌స్పెన్స్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది