Mahesh Babu : ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో పాన్ ఇండియా సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత విదేశాలకు వెళ్ళి బాగా రిలాక్స్ అయి వచ్చిన జక్కన్న వచ్చీ రాగానే
మహేశ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో చర్చలకు దిగారు. ఇద్దరూ కలిసి మహేశ్ సినిమా కథపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు రాజమౌళి కెరీర్‌లో ఫ్లాప్ అంటే ఏంటో చూడని జక్కన్న హీరోలకు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తీసుకొచ్చిపెట్టారు.
ప్రభాస్ ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొడుతున్నాడంటే దానికి కారణం ఆయనే. ఆర్ఆర్ఆర్ తర్వాత హీరోలు చరణ్, ఎన్.టి.ఆర్ లైనప్ కూడా భారీ ప్రాజెక్ట్‌తోనే సాగుతుంది. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్‌ను మహేశ్ బాబుకు తెచ్చేందుకు జక్కన్న బృందం రెడీ అవుతోంది. పదేళ్ళ నుంచి అదిగో ఇదిగో అంటూ హోల్డ్‌లో ఉన్న మహేశ్ – రాజమౌళిల సినిమా ఎట్టకేలకు ప్రముఖ నిర్మాత డా కె ఎల్ నారాయణ సెట్స్‌పైకి తెస్తున్నారు. ఒకవేళ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌తో సమయం సరిపోకపోతే, వచ్చే ఏడాది ప్రారంభంలో అయినా షూటింగ్ మొదలనుంది. అంతేకాదు, ఎట్టిపరిస్థిస్తుల్లో 2024లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్‌ను జక్కన్న టీమ్ పరిశీలిస్తుందట. సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ద, ఇక్కడ బాగానే జనాలను ఆకట్టుకుంది. కానీ, సాహో ఫ్లాప్ కావడంతో ఇక్కడ మేకర్స్ పట్టించుకోలేదు. అయితే, రాజమౌళి చేసేది
మహేశ్ తో పాన్ ఇండియన్ సినిమా. పైగా అనుకున్న కథకు శ్రద్దా అయితే మహేశ్ పక్కన సరిగ్గా సూటవుతుందని ఆమెను తీసుకుందామనుకుంటున్నారట. కానీ, సాహో ఫలితం మహేశ్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతుందట. అందుకే, సోషల్ మీడియా ద్వారా మహేశ్‌కు శ్రద్దాను ఫిక్స్ చేయవద్దంటూ సలహాలిస్తున్నారట. మరి జక్కన్న ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.