Mahesh Babu : మహేష్ బాబు పక్కన శ్రద్ధా కపూర్.. వద్దంటున్న ఫ్యాన్స్.?

Authored By vamana sai | The Telugu News | Published on: June 8, 2022, 8:30 pm

Mahesh Babu : ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో పాన్ ఇండియా సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత విదేశాలకు వెళ్ళి బాగా రిలాక్స్ అయి వచ్చిన జక్కన్న వచ్చీ రాగానే
మహేశ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో చర్చలకు దిగారు. ఇద్దరూ కలిసి మహేశ్ సినిమా కథపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు రాజమౌళి కెరీర్‌లో ఫ్లాప్ అంటే ఏంటో చూడని జక్కన్న హీరోలకు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తీసుకొచ్చిపెట్టారు.

ప్రభాస్ ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొడుతున్నాడంటే దానికి కారణం ఆయనే. ఆర్ఆర్ఆర్ తర్వాత హీరోలు చరణ్, ఎన్.టి.ఆర్ లైనప్ కూడా భారీ ప్రాజెక్ట్‌తోనే సాగుతుంది. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్‌ను మహేశ్ బాబుకు తెచ్చేందుకు జక్కన్న బృందం రెడీ అవుతోంది. పదేళ్ళ నుంచి అదిగో ఇదిగో అంటూ హోల్డ్‌లో ఉన్న మహేశ్ – రాజమౌళిల సినిమా ఎట్టకేలకు ప్రముఖ నిర్మాత డా కె ఎల్ నారాయణ సెట్స్‌పైకి తెస్తున్నారు. ఒకవేళ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌తో సమయం సరిపోకపోతే, వచ్చే ఏడాది ప్రారంభంలో అయినా షూటింగ్ మొదలనుంది. అంతేకాదు, ఎట్టిపరిస్థిస్తుల్లో 2024లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Mahesh Babu Next Movie To Shraddha Kapoor Fans Speaking No

Mahesh Babu Next Movie To Shraddha Kapoor Fans Speaking No

Mahesh Babu : జక్కన్న ఏం డిసైడ్ చేస్తారో..?

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్‌ను జక్కన్న టీమ్ పరిశీలిస్తుందట. సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ద, ఇక్కడ బాగానే జనాలను ఆకట్టుకుంది. కానీ, సాహో ఫ్లాప్ కావడంతో ఇక్కడ మేకర్స్ పట్టించుకోలేదు. అయితే, రాజమౌళి చేసేది
మహేశ్ తో పాన్ ఇండియన్ సినిమా. పైగా అనుకున్న కథకు శ్రద్దా అయితే మహేశ్ పక్కన సరిగ్గా సూటవుతుందని ఆమెను  తీసుకుందామనుకుంటున్నారట. కానీ, సాహో ఫలితం మహేశ్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతుందట. అందుకే, సోషల్ మీడియా ద్వారా మహేశ్‌కు శ్రద్దాను ఫిక్స్ చేయవద్దంటూ సలహాలిస్తున్నారట. మరి జక్కన్న ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.

vamana sai

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp