Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎంత నాటీయో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ అల్లరి చేస్తూనే ఉంటుంది. పెళ్లైనా కూడా ఆ అల్లరి మాత్రం ఇంకా మానలేదు. ఇంకా ఆమెలోని పసితనం పోలేదనిపిస్తుంది. ఇక తాజాగా నిహారిక కొణిదెల తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. అందులో భాగంగా నెటిజన్లు కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రశ్నలు అంటే నేరుగా ప్రశ్నించలేదు. ముందు నిహారిక ఇచ్చిన ఆప్షన్స్, సదరు ప్రశ్నకు సంబంధించిన నంబర్‌ను చెబితే.. నిహారికే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. అందులో ఓ క్రేజీ నెటిజన్.. స్కూల్‌లో చేసిన తప్పులను ఒప్పుకో అని అడిగేశాడు. దానికి నిహారిక భలే సమాధానం చెప్పింది. అసలే నిహారిక స్కూల్‌లో ఎంత అమాయకంగా ఉండేదో ఆ మధ్య ఓ సారి చెప్పుకొచ్చింది.
తన తండ్రి నాగబాబు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసిందట. తన తండ్రి కడుపులోనే తాను పుట్టానని నమ్మకంతో ఉండేదట. అందరూ అమ్మ కడుపులో పుడితే.. తాను మాత్రం నాన్న కడుపులో పుట్టానని, తాను ఎంతో స్పెషల్ అనే భ్రమలో నిహారిక ఉండేదట. ఈ విషయాన్ని స్వయంగా తండ్రే చెప్పడంతో నమ్మేసిందట. నాగబాబుకు ఒంటి మీద ఉన్న గాటు ఏంటని చిన్నప్పుడు నిహారిక అడిగితే పై విధంగా కథలుచెప్పాడట. ఆ విషయాన్ని గుడ్డిగా నమ్మిన నిహారిక.. ఆ తరువాత బయాలజీ క్లాసులో అసలు విషయం అర్థమైందట. మొత్తానికి నిహారిక అంత అమాయకంగా ఉండేదన్న మాట.
అలా ఇప్పుడు ఓ నెటిజన్ స్కూల్ మ్యాటర్ అడగడంతో అసలు విషయం చెప్పేసింది. ఈ విషయం చెప్పే ముందు నిహారిక తన మొహాన్ని దాచేసుకుంది. ఇంతకీ నిహారిక చెప్పిన విషయం ఏంటో ఓ సారిచూద్దాం. నిహారిక తన స్కూల్‌లో హోం వర్క్ చేసేది కాదట.. ఖాళీ టైంలో తన అమ్మ వచ్చి అంతా కంప్లీట్ చేసి ఇచ్చేదట. ఈ విషయాన్ని నిహారిక ఇప్పుడు బయటపెట్టేసింది. అంటే నిహారిక స్కూల్ ఏ రేంజ్ ఇంటెలిజెంటో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి నిహారిక అల్లరి మాత్రం అప్పుడు ఇప్పుడు ఏం మారలేనట్టుంది.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.