Mahesh Babu : రాజమౌళి తర్వాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో సినిమా చేయనున్నారంటే..!
ప్రధానాంశాలు:
Mahesh Babu : రాజమౌళి తర్వాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో సినిమా చేయనున్నారంటే..!
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు రేంజ్ త్వరలో వరల్డ్ మార్కెట్ ను చేరుకోబోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో మహేశ్ బాబు సినిమా చేస్తుండటంతో బాబు రేంజ్ గ్లోబల్ వైడ్ గా మారిపోవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి ప్రచారం ఉంది. అయితే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత కచ్చితంగా తర్వాత సినిమా ఫ్లాప్ అవడం హీరోలకు ఆనవాయితీగా వస్తోంది.

Mahesh Babu : రాజమౌళి తర్వాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో సినిమా చేయనున్నారంటే..!
Mahesh Babu ఎవరితో అంటే..
అయితే మహేష్ బాబు రాజమౌళి తర్వాత ఎవరి దర్శకత్వంలో చేయాలనే విషయంలో ఇప్పటికే స్పష్టతగా ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప2తో భారీ హిట్ కొట్టిన సుకుమార్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయబోతున్నారు. వన్ నేనొక్కడినే సినిమా ఫ్లాప్ కావడంతో మహేష్ బాబుకు సుకుమార్ ఎలాగైనా హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మహేష్ బాబు 30వ సినిమా తెరకెక్కబోతోంది.
సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోగా స్పిరిట్, యానిమల్ పార్క్ పూర్తిచేసి మహేష్ బాబుతో సినిమా చేయాలనే పట్టుదలతో సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. ఒక కథను కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్, సందీప్ రెడ్డి వంగాల్లో ఎవరితో ఒకరితో మాత్రం సినిమా చేయడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.