Mahesh Babu Rajamouli Movie update
Mahesh Babu : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందబోతోంది. ఆ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మహేష్ బాబు కు కనీసం స్టోరీ లైన్ ని కూడా రాజమౌళి చెప్పలేదు అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరో వైపు రాజమౌళి సినిమా కథ రెడీ అవ్వక ముందే అంతర్జాతీయ వీ ఎఫ్ ఎక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని.. ఆ సంస్థ తోనే మహేష్ బాబు సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ మొత్తం చేయించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది.
జక్కన్న సినిమాకు వారు గ్రాఫిక్స్ చేయడానికి ఇప్పటికే ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్ కూడా సిద్ధం చేస్తున్నారట. ఒక సినిమా కు కథ కూడా రెడీ అవకుండా, షూటింగ్ కూడా ప్రారంభం కాకుండా ఇలా గ్రాఫిక్స్ కోసం ఒప్పందాలు జరగడం ఏంటో అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆమధ్య విదేశాలకు వెళ్ళిన రాజమౌళి ఈ విషయమై చర్చ జరిగినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజమౌళి అనే దర్శకుడు సినిమాను గ్రాఫిక్స్ లేకుండా చేయలేడు అనే వాదన గతంలో ఉండేది.
Mahesh Babu Rajamouli Movie update
ఆ ప్రచారం.. వాదన నిజం అనే విధంగా జక్కన్న ఒప్పందాలు ఉన్నాయంటూ తాజాగా ఆయన అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. జక్కన్న కేవలం గ్రాఫిక్స్ మీదనే ఆధారపడతాయి అని ఆయన సినిమాలకు కథా మరియు ఇతర అంశాలు ఏమీ ఉండవని గ్రాఫిక్స్ కోసం జనాలు చూడటానికి ఆసక్తి చూపిస్తారని గతంలో పుకార్లు షికార్లు వచ్చేవి. ఇప్పుడు అదే మాట వాస్తవం చేస్తూ కథ కూడా అనుకోకుండానే మహేష్ బాబు సినిమా కు సంబంధించిన గ్రాఫిక్స్ రాజమౌళి మొదలు పెట్టడం విడ్డూరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
This website uses cookies.