Mahesh Babu : మహేష్‌, రాజమౌళి సినిమా… అది లేకుండా జక్కన్న చేయలేడా?

Authored By aruna | The Telugu News | Published on: August 1, 2022, 3:40 pm

Mahesh Babu : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందబోతోంది. ఆ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మహేష్ బాబు కు కనీసం స్టోరీ లైన్ ని కూడా రాజమౌళి చెప్పలేదు అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరో వైపు రాజమౌళి సినిమా కథ రెడీ అవ్వక ముందే అంతర్జాతీయ వీ ఎఫ్ ఎక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని.. ఆ సంస్థ తోనే మహేష్‌ బాబు సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ మొత్తం చేయించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది.

జక్కన్న సినిమాకు వారు గ్రాఫిక్స్ చేయడానికి ఇప్పటికే ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్ కూడా సిద్ధం చేస్తున్నారట. ఒక సినిమా కు కథ కూడా రెడీ అవకుండా, షూటింగ్ కూడా ప్రారంభం కాకుండా ఇలా గ్రాఫిక్స్ కోసం ఒప్పందాలు జరగడం ఏంటో అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆమధ్య విదేశాలకు వెళ్ళిన రాజమౌళి ఈ విషయమై చర్చ జరిగినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజమౌళి అనే దర్శకుడు సినిమాను గ్రాఫిక్స్ లేకుండా చేయలేడు అనే వాదన గతంలో ఉండేది.

Mahesh Babu Rajamouli Movie update

Mahesh Babu Rajamouli Movie update

ఆ ప్రచారం.. వాదన నిజం అనే విధంగా జక్కన్న ఒప్పందాలు ఉన్నాయంటూ తాజాగా ఆయన అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. జక్కన్న కేవలం గ్రాఫిక్స్ మీదనే ఆధారపడతాయి అని ఆయన సినిమాలకు కథా మరియు ఇతర అంశాలు ఏమీ ఉండవని గ్రాఫిక్స్ కోసం జనాలు చూడటానికి ఆసక్తి చూపిస్తారని గతంలో పుకార్లు షికార్లు వచ్చేవి. ఇప్పుడు అదే మాట వాస్తవం చేస్తూ కథ కూడా అనుకోకుండానే మహేష్ బాబు సినిమా కు సంబంధించిన గ్రాఫిక్స్ రాజమౌళి మొదలు పెట్టడం విడ్డూరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp