Mahesh Babu Sarkaru Vaari Paata Movie As Sankranthi Release
Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట నుంచి ఊహించని అప్‌డేట్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వచ్చి సంవత్సరం దాటిపోవడంతో ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట గురించి అందరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సర్కారు వారి పాట అన్న టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ మొదలవకుండానే రిలీజ్ డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదకి వెళ్ళిన సర్కారు వారి పాట శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
Mahesh Babu Sarkaru Vaari Paata Movie As Sankranthi Release
దుబాయ్ లో సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు తో పాటు హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ మీద కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్.. మైత్రీ మూవీ మేకర్స్ … 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ సమ్యుక్తంగా నిర్మిస్తున్నారు. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు పరశురాం. కాగా ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
కాగా గత రెండు రోజులుగా టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు ఆర్ ఆఎర్ ఆర్ .. ఆచార్య…పుష్ప.. రాధే శ్యాం లాంటి పాన్ ఇండియన్ సినిమాల రిలీజ్ డేట్స్ ని ప్రకటిస్తూ అభిమానులకి భారీ సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ తాజాగా ప్రకటిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. 2022 సంక్రాంతికి సర్కారు వారి పాట రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మహేష్ నుంచి సినిమా వచ్చి ఇప్పటికే ఏడాది దాటిపోగా మరో ఏడాది ఎదురు చూడాల్సిందే అని తాజాగా ప్రకటించిన పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. ఇది కొంతవరకు ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ మెంట్ అని అంటున్నారు.
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…
Wife Husband : జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్కు చెందిన బింగి రాజశేఖర్ తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్ వ్యక్తితో సంబంధం…
This website uses cookies.