Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ ప్రారంభం.. మొత్తానికి మొదలెట్టేసిన మహేష్ బాబు
Mahesh babu Sarkaru Vaari Paata సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు. గతేడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బాక్సాఫీస్ మీద దాడి చేసిన మహేష్ బాబు రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టాడు. దీంతో మహేష్ బాబు ఫుల్ ఖుషీ అయి వెకేషన్స్‌కు వెళ్లాడు. అలా తిరిగి వచ్చాక వంశీ పైడిపల్లి చిత్రం ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. కానీ అక్కడే అసలు కథ మలుపులు తిరిగింది. ఒకానొక దశలో మహేష్ బాబు అసలు కథ, దర్శకుడే దొరకలేదు.

Mahesh babu Sarkaru Vaari Paata shoot begins
కరోనా, లాక్డౌన్ సర్కారు వారి పాట షెడ్యూల్స్‌లో వల్ల మార్పులు
పరుశురాం చెప్పిన కథను పక్కన పెట్టేసిన మహేష్ బాబు.. మళ్లీ ఆయన్నే పిలిపించుకున్నాడు. అలా చివరకు సర్కారు వారి పాట పట్టాలెక్కింది. కానీ అంత లోపే కరోనా, లాక్డౌన్ వంటివి రావడంతో సర్కారు వారి పాట షెడ్యూల్స్‌లో అన్నీ మార్పులు వచ్చాయి. చివరకు అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక అయినా సినిమా పట్టాలెక్కుతుందేమో అని అంతా ఎదురుచూశారు. కానీ మహేష్ బాబు మాత్రం షూటింగ్‌లకు నో చెప్పేశాడు. అందుకే సమయం వృథా చేయడం ఎందుకని మ్యూజిక్ సిట్టింగ్స్ వేసేశారు ఆ మధ్య.
అయితే గత ఏడాది నవంబర్ డిసెంబర్‌లో షూటింగ్ చేద్దామని అనుకున్నా కుదరలేదు. అలా ఆ ముహూర్తం నేటికి ఫిక్స్ అయింది. నేడు ఎట్టకేలకు సర్కారు వారి పాట షూటింగ్ మొదలైంది. ఈ మేరకు నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక నిరంతరంగా సాగే ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు జాయిన్ కానున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు నమ్రత బర్త్ డే సెలెబ్రేషన్స్ ముగించుకుని వచ్చాడు. ఇకపై కంటిన్యూగా మహేష్ బాబు షూటింగ్‌లతో బిజీగా ఉండబోతోన్నాడట.