Samantha : సమంతతో ఆడుకుంటున్న మహేశ్ బాబు ఫ్యాన్స్.. సోషల్‌మీడియాలో రచ్చ రచ్చే..

Authored By mallesh | The Telugu News | Published on: December 11, 2021, 5:40 pm

Samantha : ఒక ట్వీట్ సమంతను చిక్కుల్లోకి నెట్టింది. ఓ టాప్ హీరో ఫ్యాన్స్‌ను చాలా హర్ట్ చేసింది. ఇది జరిగి ఎనిమిదేండ్లు అవుతున్నా.. ఫ్యాన్స్ ఈ ఘటనను మర్చిపోవడం లేదు. అసలేం జరిగిందంటే… సూపర్ స్టార్ మహేశ్ బాబు యాక్ట్ చేసిన 1 నేనొక్కడినే మూవీ పోస్టర్‌పై అప్పట్లో సమంత ఓ ట్వీట్ చేసింది. అది కావాలని అలా చేశారో లేక పొరపాటున జరిగిందో తెలియదు కానీ.. అప్పటి నుంచి మహేశ్ ఫ్యాన్స్ ఇంకా చాన్స్ వచ్చినప్పుడల్లా సమంతతో సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.ప్రస్తుతం ఆమె పుష్ప మూవీలో ఓ ఐటమ్ సాంగ్ లో యాక్ట్ చేసింది.

ఈ పాటను ఇటీవలే రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. ఉ అంటావా.. ఊ..హూ.. అంటావా అంటూ సాగే ఈ సాంగ్‌లో సమంత తన హాట్, మాస్ స్టెప్పులతో దుమ్మురేపింది. దీంతో ఈ లిరికల్ సాంగ్‌లోని సీన్‌లను స్క్రీన్ షాట్స్ తీసి సమంత ట్వీట్‌కు రిప్లై ఇచ్చే పనిలో పడ్డారు మహేశ్ ఫ్యాన్స్.. అప్పట్లో సామ్ ఎలాంటి పదాలు వాడిందో, అలాంటి పదజాలంతోనే ట్వీట్ లు చేస్తున్నారు.. పుష్పలో మీరు తీరు చూసి మేమూ హర్ట్ అయ్యాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సమంత ఆ ట్వీట్ చేసి ఎనిమిదేండ్లు గడిచినా దాని రియాక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫీలింగ్స్ మీకు మాత్రమే కాదు..

mahesh fan trolls on samantha

mahesh fan trolls on samantha

Samantha : ఎనిమిదేళ్ల క్రితం..

మాకూ ఉంటాయంటూ రియాక్ట్ అవుతున్నారు మహేశ్ ఫ్యాన్స్. కానీ సమంత ట్వీట్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఆ వివాదాన్ని మూవీ యూనిట్ సైతం ఇప్పటికే మర్చిపోవచ్చు. కానీ మహేశ్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా సమంతపై రివెంజ్ తీర్చుకుంటూనే ఉన్నారు. అసలే నాగచైతన్యతో విడిపోయిన విషయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ వరసగా మూవీలు చేస్తూ బిజీ అయిపోయింద ఈ భామ.. అందులో భాగంగానే పుష్పలో ఐటం సాంగ్‌లో యాక్ట్ చేసింది. ఈ పాటకు క్రేజ్ ఏర్పడగా.. మహేశ్ ఫ్యాన్స్ చేస్తున్న పనికి సమంతకు చేదు అనుభవం ఎదురవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp