Home » Entertainment » Mallemala Team Gives Clarity On Sudigali Sudheer And Getup Srinu
Entertainment

Sudigali Sudheer : మల్లెమాల మామూల్ది కాదు.. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులపై అలా క్లారిటీ ఇచ్చేసింది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 5, 2022, 10:30 am
Advertisement

Sudigali Sudheer : మల్లెమాల టీం, జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌కు ట్రెండ్‌ను ఎలా పట్టుకోవాలో బాగా తెలుసు. ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్‌లను ఎలా వాడుకోవాలో తెలుసు. తమ మీద వచ్చే కామెంట్లను ఎలా తిప్పి కొట్టాలో ఇంకా బాగా తెలుసు. ఇక వివాదాలు చుట్టి ముట్టినప్పుడు మాత్రం ఎంతో ఓర్పుగా ఉంటారు. ఆ కామెంట్లకు తరువాత సరైన రీతలో సమాధానం చెబుతుంటారు. అయితే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం వదిలిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. అసలే సుధీర్, గెటప్ శ్రీను ఇద్దరూ లేక షో అంతా చప్పబడింది.

Advertisement

మూడు నెలల క్రితమే గెటప్ శ్రీను వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు సుధీర్ కూడా వెళ్లిపోయాడు. దీంతో మల్లెమాల మీద రకరకాల రూమర్లు వచ్చాయి. వాళ్లతో చెడటంతోనే ఇలా అందరూ బయటకు వస్తున్నారంటూ కామెంట్లు వినిపించసాగాయి. అయితే మధ్య మధ్యలో స్కిట్ల రూపంలో అసలు విషయాన్ని చెబుతూనే వచ్చారు. వారు సినిమాలతో బిజీగా అవుతుండటంతోనే ఈ షోను వదిలేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా ఈ సమస్య మీదే స్కిట్ చేసి అందరికీ ఓ క్లారిటీ ఇప్పించింది మల్లెమాల టీం.

Mallemala team gives clarity on Sudigali Sudheer and getup Srinu

Advertisement

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రాకింగ్ రాకేష్ వేసిన స్కిట్ చూస్తే ఎవ్వరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే.కంట్లోంచి కన్నీరు కార్చాల్సిందే. ఆ ముగ్గురి స్నేహం గురించి చెబుతూ తమ తప్పేమీ లేదన్నట్టుగా మల్లెమాల చెప్పకనే చెప్పేసింది. వాళ్లకు సినిమా చాన్సులు వస్తుండటంతో షోను వదిలేశారు.. మళ్లీ వెనక్కి వస్తారన్నట్టుగా మల్లెమాల చెప్పించింది. మొత్తానికి ఈ ప్రోమోతో అందరికీ అయితే ఓ క్లారిటీ వచ్చింది. అయితే శ్రీను, సుధీర్ ఎప్పుడు వస్తారో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి