Mana Shankara Vara Prasad Garu Ccollection : సంక్రాంతికి మెగాస్టార్ బాక్సాఫీస్ దండయాత్ర .. ‘మన శంకర వరప్రసాద్ గారు’ కలెక్షన్ల సునామీ
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా విక్టరీ స్టార్ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించడం సినిమాకు అదనపు హైప్‌ను తీసుకొచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారీ స్టార్ క్యాస్ట్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్ కారణంగా సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Mana Shankara Vara Prasad Garu Ccollection : సంక్రాంతికి మెగాస్టార్ బాక్సాఫీస్ దండయాత్ర .. ‘మన శంకర వరప్రసాద్ గారు’ కలెక్షన్ల సునామీ
Mana Shankara Vara Prasad Garu Ccollection : ‘మన శంకర వరప్రసాద్ గారు’ కలెక్షన్ల సునామీ
థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే .. ఆంధ్రా రైట్స్: రూ.55 కోట్లు, నైజాం రైట్స్: రూ.32 కోట్లు, సీడెడ్: రూ.18 కోట్లు.. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం రూ.105 కోట్ల బిజినెస్ క్లోజ్ అయ్యింది. ఇతర రాష్ట్రాలు కలిపి ఇండియా మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు చేరింది. ఓవర్సీస్‌లో నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడవ్వగా, మొత్తం వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాకు రూ.140–150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం సినిమా పూర్తిస్థాయిలో లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.280–300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇండస్ట్రీ ట్రాకింగ్ లెక్కల ప్రకారం, ప్రీమియర్ డే రోజునే ఈ సినిమా సుమారు రూ.9.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత డే 1న ఏకంగా రూ.32.25 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. సంక్రాంతి సెలవులు, మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, ఫ్యామిలీ ఆడియెన్స్ స్పందన కలిసి ఈ భారీ ఓపెనింగ్‌కు కారణమయ్యాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డే 2న సహజంగానే కాస్త డ్రాప్ కనిపించినప్పటికీ, సినిమా సుమారు రూ.19.5 కోట్ల నెట్ (రఫ్ డేటా) వసూలు చేసినట్లు అంచనా. మొత్తంగా కలెక్షన్లు మాత్రం స్ట్రాంగ్‌గా కొనసాగాయి. మూడో రోజు విషయానికి వస్తే, ట్రేడ్ వర్గాలు మరింత బలమైన ఫిగర్స్‌ను అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో: రూ.20–25 కోట్లు, ఇతర రాష్ట్రాలు & కర్ణాటక: రూ.6 కోట్లు, ఓవర్సీస్: రూ.6 కోట్లు.. ఈ లెక్కన మూడో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.38–40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. .. ఇదిలా ఉండగా, మేకర్స్ అధికారికంగా రెండు రోజుల కలెక్షన్లను ప్రకటించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డేనే రూ.84 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిందని వెల్లడించారు. అంతేకాదు, రెండు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.