
Manchu Lakshmi : నేను బాధితురాలని అంటూ కన్న తండ్రిపై మంచు లక్ష్మీ సంచలన ఆరోపణలు
Manchu Lakshmi : మంచు లక్ష్మి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో సందడి చేసిన మంచు లక్ష్మీ ఇప్పుడు అంతగా ఆఫర్స్ అందుకోవడం లేదు. ఇప్పుడామె హైదరాబాద్ వదలి ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఏంటి? తన కుటుంబం వల్ల తాను పడిన ఇబ్బందుల గురించి ఫ్రీ ప్రెస్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. తాను హైదరాబాద్ వదిలి ముంబై రావడానికి తన కుటుంబం అడ్డంకిలా మారిందని తెలియజేసింది. నేను నా బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. నన్ను ముంబై రావాల్సిందిగా ఆమెనే పట్టుబట్టింది. రానాతో మాట్లాడినప్పుడు కూడా నేను ఎప్పటికీ హైదరాబాద్ లోనే ఉండిపోకూడదని అతడు కూడా చెప్పాడు” అని లక్ష్మి తెలిపింది.
సౌత్ లో హీరోల కూతుళ్లకు, సిస్టర్స్ కి అవకాశాలు ఇవ్వరు. నేను నటి కావడం నాన్నకు కూడా ఇష్టం లేదు. నా ఇద్దరు బ్రదర్స్ కి సులభంగా దక్కినవి నేను కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలినే. ఈ ధోరణి సౌత్ లోనే కాదు, దేశమంతా ఉంది.. అని ఆవేదన వ్యక్తం చేసింది మంచు లక్ష్మీ.దక్షిణాదిలో జనం హీరోల కూతుళ్లు, అక్కచెల్లెళ్లు నటులుగా మారడాన్ని అస్సలు అంగీకరించరు. మాలాంటి వాళ్లను నటింపజేయడానికి వెనుకడుగు వేస్తారు. ప్రకాశ్ కోవెలమూడి నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ మా నాన్న (మోహన్ బాబు), రాఘవేంద్ర రావు అది జరగకుండా చూడటానికి ప్రయత్నించారు” అని లక్ష్మి చెప్పడం గమనార్హం.
Manchu Lakshmi : నేను బాధితురాలని అంటూ కన్న తండ్రిపై మంచు లక్ష్మీ సంచలన ఆరోపణలు
ఒకప్పుడు అమెరికాలో ఉన్న మంచు లక్ష్మీ అక్కడ పలు టీవీ షోలలో నటించింది.2011లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనగనగా ఓ ధీరుడు మూవీతో అరంగేట్రం చేసింది. ఈ సినిమాకు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు. వరుస ప్లాప్స్ తో మంచు లక్ష్మి ఇమేజ్ దెబ్బతింది. అయినప్పటికీ ఆమె సినిమాలు చేయడం ఆపలేదు.మంచు లక్ష్మి నిర్మాత కూడాను. తన బ్రదర్స్ తో కొన్ని సినిమాలు నిర్మించింది. ఆమె లీడ్ రోల్ చేసిన చిత్రాలు కూడా తన బ్యానర్లోనే నిర్మితం అయ్యాయి. మంచు లక్ష్మి ఇటీవల అగ్ని నక్షత్రం టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఈ చిత్రం విడుదలకు నోచుకోవడం లేదు.
Today Gold Rate 18 January 2026 : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ రావడం…
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్…
Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…
Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…
Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
This website uses cookies.