Rakul Preet Singh : మళ్లీ మొదలెట్టేశారుగా.. దుమ్ములేపేసిన మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 3 June 2022, 9:00 pm

Rakul Preet Singh : రకుల్ ప్రీత్, మంచు లక్ష్మీ ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి సాన్నిహిత్యం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీరు షేర్ చేసే ఫోటోలను చూసి అందరూ తేడా కామెంట్లు కూడా చేస్తుంటారు. మంచు లక్ష్మీ, రకుల్ బంధం మీద రకరకాల ట్రోల్స్, మీమ్స్ వస్తుంటాయి. ఆ మధ్య బర్త్ డే పార్టీలో షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మంచు లక్ష్మీని రకుల్ వెనకాల నుంచి వాటేసుకోవడం, ఇద్దరూ హత్తుకున్న స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అలా ఈ ఇద్దరూ కలిసి చేసే ఫోటో షూట్లు కూడా ట్రెండ్ అవుతుంటాయి. అయితే తమ గురించి నెట్టింట్లో వచ్చే ట్రోల్స్, మీమ్స్ మీద రకుల్ కౌంటర్లు వేస్తుంటుంది.

మంచు లక్ష్మీ అయితే అలాంటివేమీ పట్టించుకోదు. మంచు లక్ష్మీ, రకుల్ ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తుంటారు. జాలీ ట్రిప్పులు వేస్తుంటారు. కలిసి రెస్టారెంట్లకు వెళ్తుంటారు. ఇక రకుల్ ఇచ్చే మెను, ఫాలో అయ్యే డైట్ల గురించి మంచు లక్ష్మీ సెటైర్లు వేస్తుంటుంది. రకుల్ వల్లే తన జీవన శైలి మారిందని, ఆహారపు అలవాట్లు మారాయని చెబుతుంటుంది మంచు లక్ష్మీ. ఈ ఇద్దరూ ఒక్క చోట చేరారంటే అక్కడంతా రచ్చ రచ్చ జరగాల్సిందే. మంచు వారి సినిమాల్లో ఎవరైనా హీరోయిన్లు నటిస్తే.. వారంతా కూడా మంచు లక్ష్మీకి మంచి ఫ్రెండ్స్‌గా మారిపోతుంటారు. అందులో రకుల్ మొదటి ప్లేస్‌లో ఉంటుంది.

Manchu Lakshmi And Rakul Preet Singh Reel Video

Manchu Lakshmi And Rakul Preet Singh Reel Video

అలా రకుల్, మంచు లక్ష్మీ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. మంచు ఫ్యామిలీలో తానూ ఒకదానిగా మారిపోయింది రకుల్ ప్రీత్. మొత్తానికి ఈ ఇద్దరూ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు కలిసినట్టున్నారు. అసలే విదేశాల నుంచి రకుల్ మొన్నే హైద్రాబాద్‌లో ల్యాండ్ అయింది. ఇక వచ్చీ రాగానే రకుల్ వద్దకు వెళ్లినట్టుంది. తాజాగా ఈ ఇద్దరూ కలిసి చేసిన రీల్ వీడియో వైరల్ కాసాగింది. ఇందులో రకుల్, మంచు లక్ష్మీ వేసిన స్టెప్పులు ట్రెండ్ అవుతున్నాయి. పంజాబీ పాటలకు మంచు లక్ష్మీతో కలిసి రకుల్ స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ మూమెంట్స్ మీద జనాలు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి