Manchu Lakshmi : చేతిలో మందు గ్లాసుతో మంచు లక్ష్మీ.. క్రమశిక్షణ అంటే అదే మరి
Manchu Lakshmi : మంచు ఫ్యామిలీ క్రమశిక్షణకు మారు పేరు అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు. సమయపాలన, మంచిదనం, క్రమశిక్షణకు శాశ్వత చిరునామా అన్నట్టుగా చెబుతుంటారు. ఇక మంచు లక్ష్మీ చేసే చేష్టలు మాత్రం వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇప్పుడు మంచు లక్ష్మీ ఫుల్ మూడ్‌లో ఉంది. మంచి ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉంది. అసలే విదేశాల్లో తెగ హడావిడి చేస్తోంది. తన పుట్టిన రోజు వేడుకల కోసమే అలా ఫారిన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది.
మొత్తానికి మంచు లక్ష్మీ అక్కడ చేస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. బికినీలో కనిపించి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇక అలా తన అందాలను ఆరబోయడంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోను చూసి నోరెళ్లబెడుతుంటారు. మామూలుగానే తన కూతురు పక్కన ఉంటేనే మందు గ్లాసులు పెట్టుకుని పార్టీలు చేసుకుంటుంది మంచు లక్ష్మీ. ఇలా విదేశాల్లో ఉన్నప్పుడు, అది కూడా తన బర్త్ డే పార్టీల్లో తాగకుండా ఉంటుందా? అనే అనుమానం రాకమానదు.
Manchu Lakshmi చేతిలో మందు గ్లాసుతో మంచు లక్ష్మీ
అలా మొత్తానికి మంచు లక్ష్మీ చీర్స్ చెబుతూ మందు కొడుతూ ఉన్నట్టు ఓ ఫోటోను షేర్ చేసింది. తన చేతిలో ఉన్న ఆ గ్లాసును చూసి అందరూ షాక్ అవుతున్నారు. మొత్తానికి మంచు ఫ్యామిలీ ఇప్పుడు మా ఎన్నికల్లో తల మునకలై ఉంటే.. మంచు లక్ష్మీ మాత్రం ఇలా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. కనీసం మా ఎన్నికల్లో మంచు లక్ష్మీ వచ్చి ఓటైనా వేస్తుందా? లేదా? అనేది కూడా అనుమానమే. తన సోదరుడు విష్ణుకు సపోర్ట్‌గా నిలుస్తుందా? లేదా చూడాలి.