Janaki Kalaganaledu 8 Oct Today Episode : జానకి చదువు విషయం తెలిసి.. జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన జ్ఞానాంబ.. రామా కూడా జానకితో వెళ్లిపోతాడా? అమ్మ మాటకు విలువిచ్చి ఇంట్లో ఉంటాడా?
Janaki Kalaganaledu 8 Oct Today episode : జానకి కలగనలేదు సీరియల్ 8 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి పుట్టిన రోజు సందర్భంగా రామా, జానకి.. ఇద్దరూ సరదాగా బయటికి వెళ్తారు. అయితే.. కాలేజీకి వెళ్లిన జ్ఞానాంబకు జానకి చదువు విషయం తెలిసిపోతుంది. అంతే కాదు.. తను సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించింది అన్న విషయం కూడా తనకు తెలుస్తుంది. దీంతో షాక్ అవుతుంది జ్ఞానాంబ.అసలు.. తనకు తెలియకుండా జానకి చదువు విషయం తన దగ్గర ఎందుకు దాచారు.. అని ఆలోచిస్తుంది జ్ఞానాంబ. నాకు తెలియకుండా దాచి.. జానకి పెళ్లి చేయడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తుంది. వెంటనే తన పొలం దగ్గరికి వెళ్లి ఒంటరిగా కూర్చుంటుంది.

janaki kalaganaledu 8 october 2021 episode
మరో వైపు.. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న మల్లిక.. జానకి రూమ్ కు వెళ్లి అక్కడ అంతా వెతుకుతుంది. తన సివిల్స్ పుస్తకాలు కనిపిస్తాయేమో అని అనుకుంటుంది. కానీ.. తనకు జానకి సర్టిఫికెట్లు కనిపిస్తాయి. దీంతో వాటిని తీసుకెళ్లి.. తెలిసిన వాళ్లకు చూపిస్తుంది. వాళ్లు అవి డిగ్రీ సర్టిఫికెట్లు అని చెబుతారు. దీంతో మల్లిక షాక్ అవుతుంది. వెంటనే తన అత్తయ్యకు ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. నీకు ఎలా తెలుసు అని జ్ఞానాంబ మల్లికను అడుగుతుంది. దీంతో జానకి సర్టిఫికెట్లు చూశాను.. అని చెబుతుంది మల్లిక.
Janaki Kalaganaledu 8 Oct Today Episode : మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలని అనుకున్న రామా, జానకి
కట్ చేస్తే.. జానకి, రామా.. గుడికి వెళ్తారు. అక్కడ కాసేపు సరదాగా గడుపుతారు. జానకిని తొలిసారి రామా అదే గుడిలో చూశా అని చెబుతాడు. దీంతో పెళ్లికి ముందే నన్ను మీరు చూశారా.. అని అడుగుతుంది జానకి. అవును అంటాడు రామా.

janaki kalaganaledu 8 october 2021 episode
ఇద్దరూ సాయంత్రం దాకా సరదాగా గడిపి ఇంటికి తిరిగి రాగానే షాక్ అవుతారు. ఆగండి.. అని చెప్పి.. జానకి సూట్ కేసును బయటికి విసిరేస్తుంది జ్ఞానాంబ. ఏం జరిగిందో అర్థం కాక.. షాక్ అవుతుంది జానకి. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు. ఇంట్లో నుంచి వెంటనే వెళ్లిపో.. అని అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి, రామా.. ఇద్దరూ షాక్ అవుతారు.
అమ్మా… ఏమైందమ్మా.. ఎందుకు అలా మాట్లాడుతున్నావు. జానకి ఏం తప్పు చేసిందని తనను ఇంట్లో నుంచి వెళ్లగొడుతున్నావు… అని అడుగుతాడు రామా. అయినా కూడా జ్ఞానాంబ వినదు. జానకిని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ ఆదేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.