Home » Entertainment » Manchu Lakshmi Workout Goes Viral
Entertainment

Manchu Lakshmi : ఈ రోజైనా కాస్త కనికరించండి.. వేడుకున్న మంచు లక్ష్మీ

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 15, 2021, 2:45 pm
Advertisement

Manchu Lakshmi : మంచు లక్ష్మీ ప్రస్తుతం వర్కవుట్ల మీద ఎంత దృష్టిపెట్టిందో అందరికీ తెలిసిందే. యోగ, వ్యాయామం, జిమ్నాస్టిక్ ఇలా అన్ని రకాలుగా మంచు లక్ష్మీ ట్రై చేస్తోంది. తన ఫిట్నెస్ మీద దృష్టిసారిస్తోంది. ఇక తాజాగా తన ట్రైనింగ్ సెషన్ గురించి ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన కర్రసాము విన్యాసాలను చూపించింది. కర్రతో రకరకాల ఎక్సర్ సైజ్‌లు చేస్తోంది.

Advertisement

Manchu Lakshmi Workout Goes Viral

మంచు లక్ష్మీ తన ట్రైనింగ్ గురించి చెబుతూ ట్రైనర్‌కు రిక్వెస్ట్ పెట్టేసుకుంది. కర్రతో విన్యాసాలు చేసి కిందా మీద పడిపోయింది మంచు లక్ష్మీ. ఇలా కష్టపడితే ఫలితం వస్తుందంటూ చెప్పుకొచ్చింది. దాదాపు 457 కేలరీలను కరిగించేశాను అని తెలిపింది. అదే మరి బీస్ట్ మోడ్ అంటే అని తన వర్కవుట్ల గురించి చెప్పుకొచ్చింది. నిన్న అలా కష్టపడటంతో నేడు కాస్త రిలాక్స్ అవుదామని అనుకున్నట్టుంది.

Advertisement

Manchu Lakshmi : వర్కవుట్లతో మంచు లక్ష్మీ బిజీ

Manchu Lakshmi Workout Goes Viral

అందుకే ఈ రోజు కాస్త కనికరించండి అంటూ తన ట్రైనర్‌ను మంచు లక్ష్మీ వేడుకుంది. అయితే దానికి అతను తన స్టైల్లోనే రిప్లై ఇచ్చాడు. రోజూ మాదిరిగానే నేను చేస్తాను అంటూ కౌంటర్ ఇచ్చాడు. అంటే ఈ రోజు కూడా మంచు లక్ష్మీ ఒళ్లు హూనం చేసేస్తాడేమో. మొత్తానికి మంచు లక్ష్మీ మాత్రం తన ఫిట్ నెస్ మీద కేరింగ్‌గానే ఉంటోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి