Home » Entertainment » Manchu Manoj And Mounika Reddy Fun With Bhuma Akhila Priya
Entertainment

Manchu Manoj : పేరు చెబితేనే లోపలకి ఎంట్రీ.. గుమ్మం దగ్గరే మంచు మనోజ్ కి షాక్ ఇచ్చిన భూమా అఖిల వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 6, 2023 4:46 pm
Advertisement

Manchu Manoj : హైదరాబాద్ ఫిలింనగర్ లో మంచు లక్ష్మీ ప్రసన్న ఇంటిలో మార్చి మూడవ తారీకు మంచు మనోజ్… భూమా మౌనికనీ రెండో పెళ్లి చేసుకోవడం తెలిసిందే. తమ్ముడు మనోజ్ పెళ్లిని లక్ష్మీ ప్రసన్న చాలా దగ్గరుండి చేయడం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సినిమా మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. భూమా మౌనికది…కర్నూలు రాయలసీమ నేపథ్యం కలిగిన కుటుంబం అనీ అందరికీ తెలుసు. రాయలసీమ రాజకీయాలలో భూమా కుటుంబం ప్రముఖ పాత్ర పోషించింది.

Advertisement

Manchu Manoj and Mounika Reddy Fun with Bhuma Akhila Priya

భూమా శోభ నాగిరెడ్డి.., భూమా నాగిరెడ్డి వైసీపీ పార్టీలో కీలకంగా రాణించారు. ఇక ఇదే కుటుంబం నుండి భూమా అఖిలప్రియ 2014 ఎన్నికల టైంలో ఎమెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడు ఆమె చెల్లె భూమా మౌనికని మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ లో పెళ్లి జరిగిన తర్వాత… భారీ కాన్వాయ్ తో మంచు మనోజ్

Advertisement

మరియు మౌనిక కర్నూలు వెళ్లారు. ఈ క్రమంలో భార్య ఇంటిలో అడుగుపెడుతున్న సమయంలో.. మౌనిక అక్క అఖిల ప్రియ మంచు మనోజ్ నీ మీ భార్య పేరు చెప్పి ఇంటిలో అడుగు పెట్టాలని ప్రశ్నలు వేసి కొద్దిసేపు ఇరుకున్న పెట్టడం జరిగింది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి మరియు భూమా శోభా నాగిరెడ్డి సమాధి వద్ద.. మంచు మనోజ్ నివాళులర్పించారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి