Manchu Mohan Babu : గతం గతహా.. నిన్న జరిగింది మర్చిపోవాలి.. మంచు గొడవలపై మోహన్‌బాబు ఇలా..!
Manchu Mohan Babu : కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు Manchu Mohan Babu మొన్నటిదాకా ఫ్యామిలీ గొడవల్లో వార్తల్లో నిలిచారు. అంతేకాదు టీవీ 9 రిపోర్టర్ ని కొట్టిన కేసులో ఆయన కేసు కోర్టులో ఉంది. మంచు విష్ణు, మనోజ్ ల మధ్య ఫైట్ నడుస్తూనే ఉంది. వీటన్నిటికీ కొద్దిగా గ్యాప్ ఇచ్చేద్దామని.. తన ఇంట్లో సంక్రాంతి పండగ వైభవం మొదలు పెట్టారు.
Manchu Mohan Babu నిన్న జరిగింది మర్చిపోను..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన మంచు మోహబ్ బాబు రాయలసీమ రామన్న చౌదరిలో ఒక డైలాగ్ ఉంది.. నిన్న జరిగింది మర్చిపోను, నేను జరగాల్సింది వాయిదా వెయ్యను, రేపటి గురించి ఆలోచించను అని ఉంది కాని ఇప్పుడు నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలో అది చేయాలి, రేపు దీనికంటే గొప్పగా ఏం చేయాలో ఆలోచించాలి అని అన్నారు.
ఈ క్రమంలో సినిమా వాళ్లకు అసలైన పండగ సినిమా సక్సెసే అని.. సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లల్లోకి వచ్చి అనదరికి సుఖ సంతోషాలు కలగాలని షిర్డీ సాయిని కోరుతున్నా అన్నారు మోహన్ బాబు. Mohan Babu, Sankranthi, Manchu Vishnu, Manchu Manok