Manchu Vishnu : మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు ఆనతి కాలంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఢీ సినిమాతో మంచు విష్ణుకి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ దక్కింది. అయితే కొన్నాళ్లుగా సరైన సక్సెస్‌లు దక్కించుకోలేకపోతున్నాడు మంచు విష్ణు. తాజాగా జిన్నా సినిమాతో అలరించే ప్రయత్నం చేయబోతున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ‘జిన్నా’. సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పూత్ హీరోయిన్లుగా నటించారు. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించగా,.
ఈ సందర్భంగా మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఇక మలయాళ సినిమా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ను మంచు విష్ణు రీమేక్ చేస్తున్నారట. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఈ సినిమాలో విష్ణు నటిస్తారట. ఇంత వరకు బాగానే ఉంది. ఎందుకంటే 2019లో వచ్చిన ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. సైంటిఫిక్ ఫిక్షనల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ‘ఆహా’ కొనుగోలు చేసింది.
తెలుగులో ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’గా అందుబాటులోకి తెచ్చింది.అయిన ఈ సినిమాను మంచు విష్ణు తెలుగులోనే రీమేక్ చేయడం నిజంగా సాహసమే. విష్ణు ఏడు సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేశారట. వీటిలో ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ ఒకటి. గతంలో మోహన్ బాబు మరియు విష్ణు పలు రీమేక్స్ లో నటించినప్పటికీ.. ఒకేసారి 7 ఇతర భాషల సినిమాల రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడం అనేది జరగలేదు. మరి ఈ రీమేక్స్ మంచు ఫ్యామిలీకి ఎలాంటి అనుభవాన్నిస్తాయో చూడాలి. చూస్తూ చూస్తూ ఈ రీమేక్‌లతో మంచు విష్ణు తన కెరీర్‌ని నాశనం చేసుకుంటున్నాడా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిన్నా సినిమాపైనే మంచు విష్ణు బోలడెన్ని ఆశలు పెట్టుకున్నాడు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.