
Manchu Vishnu Satirical Comments On Telugu Film Industry Person Over Pension
Manchu Vishnu : మంచు విష్ణు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. తాజాగా ఆయన మూవీ ఆర్టిస్ట్స్ మెంబర్స్ కు పెన్షన్ ఇవ్వడంపై మీడియా సమావేశం నిర్వహించారు. 60 సంవత్సరాలు పైబడిన వాళ్లకు ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తుందో మంచు విష్ణు చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ సభ్యులుగా ఉన్నవాళ్లకు నెలకు 6 వేల పెన్షన్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ.. ఇటీవల ఓ ఆరుగురు సభ్యులకు తీసేశామని.. వాళ్లు అసలు మా సభ్యులు కాదని చెప్పారు.
Manchu Vishnu Satirical Comments On Telugu Film Industry Person Over Pension
అయితే.. మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఎవరైనా ధర్నాలు చేసినా.. మీడియా ముందు మాట్లాడినా వాళ్ల సభ్యత్వం తీసేస్తామని మంచు విష్ణు హెచ్చరించారు. కనీసం 5 సంవత్సరాలు సభ్యులుగా ఉండాలి. సస్పెండ్ అయినా కూడా వాళ్లకు మా ప్రెసిడెంట్ గా పోటీ చేసే అవకాశం ఉండదన్నారు. ఆరుగురికి పెన్షన్ క్యాన్సిల్ చేయడానికి కారణం కూడా చెప్పారు.
Manchu Vishnu Satirical Comments On Telugu Film Industry Person Over Pension
డీఆర్సీ కమిటీతో చర్చించాకనే ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. కొందరు వంటమనుషులకు పెన్షన్ ఇచ్చారని, కొందరు మా అసోసియేషన్ సభ్యులు కాదని.. అందులో ఒక నటుడి కూతురుకు పెన్షన్ వస్తోందన్నారు. అందుకే వాళ్ల పెన్షన్ తీసేసి.. నేనే సొంతంగా నా డబ్బులతో పెన్షన్ పంపిస్తున్నా అన్నారు. అయితే.. 60 ఏళ్లు పైబడిన సభ్యులు అంటే.. మెగాస్టార్ చిరంజీవికి కూడా పెన్షన్ వస్తుంది కదా. ఆయనకు కూడా నెలకు 6 వేల పెన్షన్ పంపిస్తారా? అంటూ నెటిజన్లు మంచు విష్ణును ట్రోల్ చేస్తున్నారు.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.