Manchu Vishnu : మనోజ్ తో కలిసిపోయేందుకు రెడీ.. మంచు విష్ణు ఏం ట్విస్ట్ ఇచ్చాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Manchu Vishnu : మనోజ్ తో కలిసిపోయేందుకు రెడీ.. మంచు విష్ణు ఏం ట్విస్ట్ ఇచ్చాడుగా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :19 January 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Manchu Vishnu మనోజ్ తో కలిసిపోయేందుకు రెడీ.. మంచు విష్ణు ఏం ట్విస్ట్ ఇచ్చాడుగా..!

Manchu Vishnu : మంచు ఫ్యామిలీలో గొడవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబు ఇద్దరు కొడుకు మంచు విష్ణు, మనోజ్ Manchu Manoj ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు. మనోజ్ రోడ్డెక్కి అల్లరి చేస్తుంటే లోపల విష్ణు చాలా స్ట్రాన్ గా కనిపిస్తున్నాడు. ఐతే అసలు వీరి గొడవలకు కారణం ఏంటన్నది మాత్రం ఎవరికీ తెలియట్లేదు. మంచు మనోజ్ ని Manchu Mohan babu మోహన్ బాబు జల్ పల్లి ఇంట్లో ఉండొద్దు అని చెప్పినందుకే ఈ గొడవలు మొదలయ్యాయని టాక్. ఆ టైం లోనే మోహన్ బాబు ఒక రిపోర్టర్ ని గాయపరచిన విషయం తెలిసిందే.సంక్రాంతి టైం లో కాస్త గొడవలకు గ్యాప్ ఇచ్చిన మంచు ఫ్యామిలీ Manchu Family ఆఫ్టర్ ఫెస్టివల్ మళ్లీ మనోజ్ తిరుపతి లో మోహన్ బాబు Manchu Mohan Babu ని కలిసేందుకు ప్రయత్నించగా కాస్త హడావిడి జరిగింది. ఐతే ఈ ఇష్యూలో మంచు విష్ణు మనోజ్ ఇద్దరు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు సోషల్ మీడియా Social Media  వేదికగా ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తూ మెసేజ్ లు చేసుకుంటున్నారు.

Manchu Vishnu మనోజ్ తో కలిసిపోయేందుకు రెడీ మంచు విష్ణు ఏం ట్విస్ట్ ఇచ్చాడుగా

Manchu Vishnu మనోజ్ తో కలిసిపోయేందుకు రెడీ.. మంచు విష్ణు ఏం ట్విస్ట్ ఇచ్చాడుగా..!

Manchu Vishnu : ముగ్గురికి సమానంగా

ఐతే రీసెంట్ గా మంచు విష్ణు ఈ విషయంపై చూచాయగా స్పందించారు. రీసెంట్ ఇంటర్యూలో మంచు విష్ణు తన తండ్రి చాలా మంచి వారని. ముగ్గురికి సమానంగా పెంచారని. తాను తన తండ్రికి మాత్రమే భయపడతానని అన్నాడు. అంతేకాదు మంచు మనోజ్ తో కలిసిపోతారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ఈ సమస్యకు కూడా దొరుకుతుంది అన్నాడు.

అంతేకాదు మనోజ్ తో కలిసిపోయేందుకు సిద్ధమని అన్నారు. ఈ గొడవల వల్ల తల్లిదండ్రులు సంతోషంగా లేరని వారు చాలా బాధపడుతున్నారని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి గొడవలు జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయని అన్నారు. మరి మంచు ఫ్యామిలీ ఈ గొడవలు ఎప్పుడు ఒక కొలిక్కి వస్తాయన్నది చూడాలి. మంచు ఫ్యామిలీని అభిమానించే వారు మాత్రం ఈ ఇష్యూపై త్వరగా ఒక డెసిషన్ తీసుకోవాలని. లేకపోతే ఇంకా గొడవలు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది