Karthika Deepam : ఇన్నేళ్లలో ఎప్పుడూ అలా చేయలేదు.. డాక్టర్ బాబుపై భార్య సెటైర్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 20, 2022, 7:37 pm

Karthika Deepam : డాక్టర్ బాబుగా నిరుపమ్, డాక్టర్ బాబు భార్యగా మంజుల నెట్టింట్లో సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఈ ఇద్దరూ తెరపై నటించే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు. చంద్రముఖి సీరియల్‌తో ఈ జోడి ప్రయాణం మొదలైంది. తెరపై నుంచి నిజ జీవితంలోనూ జంటగా మారిపోయారు. ఈ మధ్య అంటే హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌లో కలిసి నటించారు.

ఇక యూట్యూబ్‌లో అయితే ఈ ఇద్దరూ తమ తమ అభిమానులను అలరిస్తూ ఉన్నారు. రకరకాల వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు ఎన్నో విషయాలను చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఈ సంక్రాంతి సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. మంజుల నిరుపమ్ యూట్యూబ్ చానెల్లో వదిలిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Manjula Nirupam Sankrabthi Celebration Video

Manjula Nirupam Sankrabthi Celebration Video

 Karthika Deepam : సంక్రాంతి సెలెబ్రేషన్స్‌లో డాక్టర్ బాబు..

డాక్టర్ బాబు ఓ అపార్ట్మెంట్‌లో ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఆ అపార్ట్మెంట్‌ను కూడా చాలా సార్లు చూపించారు. అక్కడకు వచ్చినా దాదాపు ఆరేడేళ్లు అవుతోందట. అయితే ఇందులోకి వచ్చిన ఇన్నేళ్లలో ఏనాడూ కూడా భోగి మంటల కోసం, సంక్రాంతి సెలెబ్రేషన్స్ కోసం ఇలా ఉదయాన్నే నిరుపమ్ లేవలేదట. కానీ ఈ సారి వీడియో కోసం, అభిమానులందరి కోసం ఇలా ఉదయాన్నే లేచి భోగి మంటలు వేశారని మంజుల చెప్పుకొచ్చింది.

Cinema Desk

No bio available for this author.

  1. "Pithapuram Elections : పిఠాపురంలో జనసేనకు టెన్షన్.. టీడీపీ కొత్త బాధ్యతల్లో వర్మ!"

  2. "Bigg Boss Telugu 10 Shalini : నా వల్లే గేమ్ పాడైంది.. శివాజీ ప్రశ్నలకు కన్నీళ్లు పెట్టుకున్న శాలినీ..!"

  3. "Hyderabad Water : అప్పుడే వాటర్ ట్యాంకర్ల కోసం క్యూ.. వచ్చే వేసవిలో హైదరాబాద్‌కు నీటి కష్టాలు తప్పవా?"

  4. "Ramya Krishnan : కృష్ణవంశీ లవ్ స్టోరీ ఆ పాటతోనే మొదలైందా? ఆసక్తికర విషయాలు చెప్పిన రమ్యకృష్ణ..!"

  5. "Apple : యాపిల్స్ కొనేటప్పుడు ఈ చిన్న పని చేయండి.. చప్పటి పండ్లు ఇంటికి రావు!"

  6. "Radhika Apte : ఎంత పెద్ద సినిమా అయినా అలాంటిదైతే నో చెబుతా.. రాధిక సంచలన వ్యాఖ్యలు"

  7. "Preity Mukhundhan నాకు అలాంటి వ్యక్తంటేనే ఇష్టం.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన ప్రీతి ముకుందన్ ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp