Karthik Deepam : ఆ విషయంలో మా ఆయన నెంబర్ వన్.. నిరుపమ్‌పై మంజుల | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthik Deepam : ఆ విషయంలో మా ఆయన నెంబర్ వన్.. నిరుపమ్‌పై మంజుల

Karthik Deepam నిరుపమ్ పరిటాల Nirupam Paritala, మంజుల పరిటాల Manjula Paritala అనే పేర్లు వినని బుల్లితెర ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఈ ఇద్దరూ దుమ్ములేపుతున్నారు. మొన్నీ మధ్యే యూట్యూబ్ చానెల్‌ను కూడా పెట్టేశారు. కార్తీకదీపం డాక్టర్ బాబుగా నిరుపమ్‌కు ఉన్న క్రేజ్‌తో మంజుల నిరుపమ్ అనే యూట్యూబ్ చానెల్ ఫుల్ రేంజ్‌లో దూసుకుపోతోంది. పెట్టిన ప్రతీ వీడియో మిలియన్ వ్యూస్‌లను కొల్లగొడుతోంది. తాజాగా ఈ జోడి మరో […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :1 September 2021,4:59 pm

Karthik Deepam నిరుపమ్ పరిటాల Nirupam Paritala, మంజుల పరిటాల Manjula Paritala అనే పేర్లు వినని బుల్లితెర ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఈ ఇద్దరూ దుమ్ములేపుతున్నారు. మొన్నీ మధ్యే యూట్యూబ్ చానెల్‌ను కూడా పెట్టేశారు. కార్తీకదీపం డాక్టర్ బాబుగా నిరుపమ్‌కు ఉన్న క్రేజ్‌తో మంజుల నిరుపమ్ అనే యూట్యూబ్ చానెల్ ఫుల్ రేంజ్‌లో దూసుకుపోతోంది. పెట్టిన ప్రతీ వీడియో మిలియన్ వ్యూస్‌లను కొల్లగొడుతోంది. తాజాగా ఈ జోడి మరో వీడియోను షేర్ చేసింది.

Manjula Paritala Satires On Nirupam Paritala

Manjula Paritala Satires On Nirupam Paritala

 

ఆ విషయంలో మా ఆయన నెంబర్ వన్.. నిరుపమ్‌పై మంజుల Karthik Deepam

అందులో ఈ ఇద్దరూ కూడా ముంబైకి వెళ్తోన్నట్టు చెప్పారు. ఓ యాడ్ షూటింగ్ కోసమని ముంబైకి వెళ్తున్నట్టు నిరుపమ్, మంజుల పేర్కొన్నారు. తాను ఇది వరకే ఒకసారి ముంబైకి వెళ్లాను అని, అక్కడి షూటింగ్ పద్దతులు వేరు ఇక్కడి పద్దతులు వేరు అవన్నీ ఈ వ్లాగ్‌లో చూపిస్తాను అని నిరుపమ్ చెప్పుకొచ్చాడు.

Manjula Paritala Satires On Nirupam Paritala

Manjula Paritala Satires On Nirupam Paritala

అయితే ఎయిర్ పోర్ట్‌కు లేటుగానే బయల్దేరామని, ఫ్లైట్ అందుతుందా లేదా? అనే టెన్షన్‌లో ఉన్నాను అంటూ నిరుపమ్ కారును స్పీడుగా నడుపుతున్నాడు.ఎయిర్ పోర్టుకు లేటుగా వెళ్తే.. మన వల్లే జరిగిందని అంటారు.. ఒకవేళ కరెక్ట్ టైంలో వెళ్తే.. నేను చెప్పినట్టుగా చేశారు గనుకే వచ్చామని అంటారు.. అని మంజుల మీద నిరుపమ్ కౌంటర్లు వేశారు.

 

Manjula Paritala Satires On Nirupam Paritala

Manjula Paritala Satires On Nirupam Paritala

ఇలాంటి మాటలు చెప్పడంలో మీరు నెంబర్ వన్.. ఇలా కవర్ చేసేస్తుంటారు బాగానే అంటూ నిరుపమ్ గురించి మంజుల చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇలా వ్లాగ్ చేసి ముంబైలోని అందాలను చూపించారు. ఇందులో ఇది మొదటి పార్ట్.. ఇంకా రాబోతోన్నాయంటూ పేర్కొన్నారు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది