Prabhas : ప్రభాస్‌తో మారుతి పాన్ ఇండియా మూవీ.. క్లారిటీనిచ్చిన డైరెక్టర్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్రభాస్‌తో మారుతి పాన్ ఇండియా మూవీ.. క్లారిటీనిచ్చిన డైరెక్టర్..

 Authored By mallesh | The Telugu News | Updated on :23 January 2022,7:00 pm

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘రాధే శ్యామ్’ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో విడుదల వాయిదా పడింది. కాగా, ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ పైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో సక్సెస్ ఫుల్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా, ట్విట్టర్ వేదికగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు మారుతి.మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఖరారు అయిందని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది పోస్టులు పెట్టారు.

ఈ క్రమంలోనే రకరకాల టైటిల్స్ కూడా ప్రచారం చేస్తున్నారు. కాగా, ఈ విషయం మారుతి దృష్టికి రాగా ఆయన కూడా స్పందించాడు. మారుతి-ప్రభాస్ కాంబో మూవీకి ‘రాజా డీలక్స్’ టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు రాగా, వాటిపైన స్పందించాడు.తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి టైటిల్స్, సినిమా జోనర్స్, నటీ నటులు, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ఊహాగానాలు వస్తున్నాయని, వాటన్నటికీ కాలమే సమాధానం చెప్తుందని మారుతి ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే తనను సపోర్ట్ చేస్తున్న వారందరికీ మారుతి థాంక్స్ చెప్పాడు.

maruthi given clarity on his movie with prabhas

maruthi given clarity on his movie with prabhas

Prabhas : తనను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ చెప్పిన మారుతి..

మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతి రోజు పండగే’ చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటడమే కాదు… విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ చిత్రంతో మారుతి స్టార్ డమ్ ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. లైనప్ మూవీస్ క్రేజీ‌గా ఉండబోతున్నాయి. తన 25వ చిత్రంగా ‘స్పిరిట్ ’ ఫిల్మ్ చేయబోతున్నారు ప్రభాస్. ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీ ప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది