Maruti Plan in Prabhas Anushka single size cutout
Prabhas : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ గురించి అందరికీ తెలిసిందే. కొరటాల శివ ప్రభాస్ కోసమే రాసిన డైలాగ్ మాదిరిగా ఆయన కటౌట్‌ను చూస్తే కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే. అందుకే, ఆయన పక్కన కూడా అదే రేంజ్ కటౌట్ ఉన్న హీరోయిన్స్ ఉంటే బావుంటుందని అభిమానులు కోరుకుంటుంటారు. ఇక మన టాలీవుడ్‌లో ప్రభాస్‌కు సూటయ్యే కటౌట్..అందరూ సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తి చూపించే హీరోయిన్ అనుష్క శెట్టి. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ వచ్చాయి.
ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించాయి. ఇక ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. మంచి ఫ్రెండ్స్ కూడా. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ – అనుష్కలకు పెళ్లి కూడా చేసేశారు. వీటన్నిటినీ పట్టించుకోకుండా ఎవరి పని వారు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే, గతకొంత కాలంగా ప్రభాస్ కమిటయిన సినిమాలలో అనుష్క లేకపోవడం డార్లింగ్ ఫ్యాన్స్‌ను కొంత బాధించిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల వస్తున్న ఓ వార్త మాత్రం కాస్త ఊరట కలిగిస్తోంది. అదేమిటంటే, మరోసారి అభిమానులందరూ ఆశించినట్టుగా ప్రభాస్ – అనుష్క కలిసి స్క్రీన్ మీద సందడి చేయనున్నారట.
Maruti Plan in Prabhas Anushka single size cutout
ఈ మూవీ మారుతి స్టయిల్ ఆఫ్ కామెడితో ఉంటుందని సమాచారం. ఇక తాజాగా ఈ సినిమాపై ఫిల్మ్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ప్రకారం.. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిబోతుండగా, ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిలో ఒకరు అనుష్క శెట్టి అని..ఆమెతో ఇప్పటికే మారుతీ చర్చలు కూడా జరిపాడని అంటున్నారు. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ కోసం మేకర్స్ పలువురు యంగ్ బ్యూటీస్ పేర్లను పరిశీలిస్తున్నారట. ప్రభాస్-అనుష్కల కలిసి నటిస్తే చూడాలని డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆశపడుతున్నారు. అందుకే, మారుతీ ఈ కాంబినేషన్ సెట్ చేసి సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నాడట. అయితే.. ఈ సినిమా మొదలయ్యేది ఎప్పుడో ఇంకా ఫుల్ క్లారిటీ మాత్రం లేదు.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.