Matka Movie Collections : బాబోయ్ కోటి కన్నా తక్కువే.. మట్కా ఫస్ట్ డే కలెక్షన్స్ షాక్.. కంగువ ఫస్ట్ డే ఎంతంటే..?
Matka Movie Collections : మెగా హీరో వరుణ్ తేజ్ Varun Tej కరుణ కుమార్ కాంబోలో వచ్చిన సినిమా మట్కా. ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించారు. విజయేందర్ రెడ్డి, రజని తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. నోరా ఫతేహి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. టీజర్ ట్రైలర్ తో ఆసక్తికరంగా అనిపించిన మట్కా సినిమా మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ఆడియన్స్ పెదవి విరవడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడింది. దాని వల్ల ఎన్నో భారీ వసూళ్లు రాబడుతుంది అనుకున్న మట్కా కనీసం కోటి కూడా దాటలేకపోయింది. మట్కా సినిమాను 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ సినిమా మొదటి రోజు కేవలం 70 లక్షలు మాత్రమే రాబట్టింది. అసలు పెట్టిన బడ్జెట్ కి వచ్చిన వసూళ్లకు సమంధమే లేదు.
ఫైనల్ రన్ లో 4 కోట్లైనా తెస్తుందా లేదా అన్నట్టు ఉంది. అంటే 40 కోట్ల బడ్జెట్ లో కనీసం 1 పర్సెంట్ కూడా రికవర్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇక మట్కాకి పోటీగా వచ్చిన సూర్య కంగువ పర్వాలేదు అనిపించే వసూళ్లు రాబట్టింది. కోలీవుడ్ లో కంగువకు టాక్ బాగున్నా తెలుగు ఆడియన్స్ మాత్రం పెదవి విరిచారు.
Matka Movie Collections : బాబోయ్ కోటి కన్నా తక్కువే.. మట్కా ఫస్ట్ డే కలెక్షన్స్ షాక్.. కంగువ ఫస్ట్ డే ఎంతంటే..?
ఫైనల్ గా కంగువ సినిమా ఫస్ట్ డే 58.62 కోట్లు కలెక్ట్ చేసింది. సూర్య వన్ మ్యాన్ షో వల్ల అయినా ఈ కలెక్షన్స్ రాబట్టింది. మరి ఫుల్ రన్ లో కంగువ ఎలాంటి వసూళ్లను తెస్తుందో చూడాలి. మట్కా మాత్రం బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసిందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇప్పటివరకు చాలా డిజాస్టర్ లు ఉన్నా వాటన్నిటి కంటే మట్కా నే భారీ డిజాస్టర్ అనిపించుకుంది. కరుణ కుమార్ ఈ సినిమా గురించి చెప్పిన దానికి మట్కా పర్ఫార్మ్ చేస్తున్న దానికి అసలేమాత్రం సంబంధం లేదు.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.