
Mahesh babu : మహేష్ బాబు కొత్త సినిమా ప్రకటన రాబోతుందా.. అందుకు దర్శకుడు.. ప్రకటన తేదీ కూడా ఖరారయ్యాయా.. ఒక స్పెషల్ డేకి.. ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాబోతుందా…ఎస్..అవును.. అనే మాటే ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ బాబు నటిస్తున్న 27న సినిమా సర్కారు వారి పాట సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. ఇప్పటికే దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం రెండవ షెడ్యూల్‌ని హైదరబాద్‌లో జరుపుతున్నారు.
may 31 star director is going to announce a movie with mahesh-babu
యూనివర్సల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు పరశురాం ఈ సినిమాని హాలీవుడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ మొదలయ్యేసరికి ఇంకా ఎన్ని నెలల సమయం పడుతుందో కరెక్ట్‌గా తెలియడం లేదు.
అందుకే మహేష్ నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అయ్యాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌కి సైన్ కూడా చేశాడట. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న మహేష్ – త్రివిక్రంల కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని అనుకుంటున్నట్టు సమాచారం.
Kavitha : తెలంగాణ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల సరసన,…
Chintakayala Vijay : టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ ఇటీవల తన సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు…
Anasuya : వివాదాస్పద అంశాలపై మౌనం వహించకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో…
Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్…
Post Office Franchise 2026 : సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ మద్దతు కోరుకునే…
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 'రేంజ్' (మైలేజీ) అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు పరిష్కారంగా కొమాకి సంస్థ…
Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…
This website uses cookies.