
hema
Actor Hema : బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తుంది. ముఖ్యంగా ఈ పార్టీకి హేమ హాజరైందని వార్తలు రాగా, దానిని ఆమె ఖండించింది. అదే ఫార్మ్ హౌస్ నుండి అక్కడ తాను లేనని ఒక వీడియో చేసి అందరికీ పంపిన విషయం తెలిసిందే. ఆమె వీడియో చూసిన పోలీసులు ఆమె అదే ఫార్మ్ హౌస్ నుండి ఆ వీడియో పంపిందని, ఆమె పార్టీకి హాజరయిన వారిలో ఉందని ఖరారు చేశారు. అంతటితో ఆగకుండా హేమ బిర్యానీ తయారు చెయ్యడం గురించి ఇంకో వీడియో పెట్టింది. దీంతో జనాలకి కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే పోలీసులు పార్టీకి హాజరైన వారందరి దగ్గర రక్త నమూనాలు తీసుకొని టెస్ట్‌లకి పంపారు.
ఆ రిపోర్ట్స్ వచ్చే లోపు తాను అక్కడ లేనని చెప్పడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది హేమ. అయితే తాజాగా రిపోర్ట్స్ రాగా, ఆమె మాదక ద్రవ్యాలు సేవించినట్టు ఖరారైంది. అయితే ఆమె అక్కడ లేనట్టుగా క్రియేట్ చేసేందుకు చాలానే ప్రయత్నించింది. అక్కడ ఆమె హాజరైన పట్టికలో కృష్ణవేణిగా ఆమె పేరు రాసింది. హేమ అసలు పేరు కృష్ణవేణి కావడంతో ఆమె పోలీసులకి కూడా అలానే చెప్పింది. కాని పోలీసుల ముందు ఈమె పప్పులు ఉడకలేదు. రిపోర్ట్స్ పాజిటివ్‌గా రావడంతో ఆమె నోటీసులు అందుకోవాల్సిందే. అయితే ఈమెకి మాదకద్రవ్యం సేవించినందుకు గాను కొన్నిరోజులపాటు కౌన్సెలింగ్ ఇచ్చి పంపవచ్చని సమాచారం.
మరోవైపు తాను వెళ్లలేదని అదరగొడుతున్న నేపథ్యంలో హేమ రేవ్ పార్టీలో పాల్గొందనడానికి పలు సాక్ష్యాలు బయటకి తీస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. నటి హేమ మే 18న (శనివారం) రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారని తెలిపింది. మధ్యాహ్నం 1.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో హేమ ఉన్నారని చెప్పింది. ఇండిగో 6ఈ- 6305 విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్, తదితరులు ఉన్నారని వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు హేమ బెంగళూరు చేరుకుంది. అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్ట్‌కు హేమ అండ్ కో వెళ్లి నానా రచ్చ చేసి దొరికిపోయారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.