
Rashmika Mandanna plays new reporter role
Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రష్మిక మందన్న ఇక అక్కడ నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం స్టార్ హీరోల అందరి సరసన నటిస్తుంది. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. నేషనల్ క్రష్‌గా పాపులార్ అయిన రష్మిక మందన్నా ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో పాగా వేస్తుంది. అక్కడ ఆమెకి పాన్ ఇండియా ఆఫర్లు వస్తుండటం విశేషం. `పుష్ప`తో వచ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా రష్మిక గురించి ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.
అర్జున్ రెడ్డి సినిమాతో పాపులారిటీ అందుకున్న సందీప్ వంగ తన కొత్త సినిమా ‘యానిమల్’ ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నా క్రేజీ పాత్రతో అలరించనుందట. ఆమె పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఒక న్యూస్ రిపోర్టర్ గా రష్మిక ఈ సినిమాలో కనిపించబోతుంది. హీరో పాత్రకు ఆమె పాత్రకు మధ్య ఒక కనెక్షన్ ఉంటుందని.. ఆ కనెక్షన్ కి ఆమె వృత్తికి కూడా లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రష్మిక – రణబీర్ కపూర్ ల పై కీలక సీన్స్ ను కూడా షూట్ చేశారు. మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది.
Rashmika Mandanna plays new reporter role
మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ ‘యానిమల్’ సాగనుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్ భూషణ్ కుమార్, భద్రకాళీ పిక్చర్స్, సినీ స్టూడియోస్ వన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోవైపు తన నటనతోనూ ఆకట్టుకుంటుంది రష్మిక. కేవలం అందాలకే పరిమితం కావడం లేదు. అద్భుతమైన నటనతోనూ మెప్పిస్తుంది. నిజానికి నటనతోనే పాపులర్ అయ్యింది. `ఛలో`, `గీతగోవిందం`లో ఆమె పాత్రలో అందుకు నిదర్శనం. ఆ తర్వాత మహేష్‌తో `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాల్లో మెరిసింది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.