Meera Chopra : పెళ్లి ఎప్పుడో చెప్పేసిన మీరా చోప్రా.. ఆస్క్ మీరా హాష్ ట్యాగ్ తో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Authored By mallesh | The Telugu News | Published on: June 1, 2022, 12:30 pm

Meera Chopra : బంగారం, వాన వంటి చిత్రాల‌తో తెలుగులో క‌నిపించిన భామ మీరా చోప్రా… త‌మిళ చిత్రంతో ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ తెలుగు, హిందీ, త‌మ‌ళ చిత్రాల్లో 30కి పైగా సినిమాల్లో క‌నిపించింది. టాలీవుడ్ కి వ‌ప‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించింన బంగారం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత వాన‌, నితిన్ తో మారో, గ్రీకు వీరుడు వంటి చిత్రాల్లో మెరిసింది. బాలీవుడ్ భామ‌లు ప్రియాంకా చోప్రా, ప‌రిణితి చోప్రాల‌కు మీరా చోప్రా బంధువు అవుతుంది. తెలుగులో అవ‌కాశాలు అంత‌గా లేక‌పోవ‌డంతో బాలీవుడ్ లోనే సెటిలైంది ఈ అమ్మ‌డు. అయితే సినిమా అవ‌కాశాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటోంది.

ప‌లు సోష‌ల్ మీడియా వివాదాల‌తో కూడా పాపుల‌ర్ అయింది.గ‌తంలో ఎన్టీఆర్ పై సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్స్ వ‌ల్ల సంచ‌ల‌నం సృష్టించింది. అప్ప‌ట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై కేసులు కూడా పెట్టింది ఈ బ్యూటీ, కాగా తాజాగా మీరా చోప్రా సౌత్ ఇండియ‌న్ హీరోల గురించి ట్వీట్ చేసింది. పాన్ ఇండియా సినిమాల‌తో సౌత్ యాక్ట‌ర్స్ గుర్తింపు తెచ్చుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని.. ప్ర‌భాస్, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్, య‌ష్ ని ట్యాగ్ చేసింది. అయితే ఇందులో ఎన్టీఆర్ పేరు లేక‌పోవ‌డంతో మ‌రోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ మీరాను ట్రోల్ చేస్తున్నారు.

Meera Chopra who never said marriage

Meera Chopra who never said marriage

ఇలా సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న సృష్టించ‌డం మీరాకు కామ‌న్ ఏ.కాగా సోష‌ల్ మీడియాలో తాజాగా మీరో అభిమానుల‌తో ఆస్క్ మీరా ట్యాగ్ తో ముచ్చటించింది. దీంతో అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. ఓ నెటిజ‌న్ ఐల‌వ్యూ చెప్ప‌మ‌ని కోర‌గా చెప్పేసింది. అలాగే మ‌రో నెటిజ‌న్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. లేదా ఇలానే సింగిల్ గా ఉండిపోతారా అని అడ‌గ్గా న‌వ్వుతూ ఈ ఇయ‌ర్ లోనే చేసుకుంటాన‌ని మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టింది. అయితే ఈ ఇయ‌ర్ తో మీరా ఓ ఇంటిది అవుతుంద‌న్న‌మాట‌..

Also read

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp