Vishnu Priya : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి హౌజ్‌లో పృథ్వీ, విష్ణు ప్రియలు లవ్ బర్డ్స్ మాదిరిగా ప్రవర్తిస్తూ వార్తలలో నిలుస్తున్నారు. అయితే గత ఎపిసోడ్‌లో విష్ణు ప్రియకు, యష్మీ కి మధ్య గేమ్ జరిగింది. ఇందుకోసం బోర్డుపై ఉన్న స్క్రూలను తీసి వాటిలో ఒకే కలర్ ఉన్న లైన్‌లో పెట్టాలి. ఈ టాస్క్ లో యష్మీ గెలిచింది. గెలిచినా యష్మీ తనదగ్గరున్న సూట్ కేసును ఓపన్ చేసింది. అందులో రూ.75వేలు ఉన్నాయి. దాంతో ఆ ప్రైజ్ మని యాడ్ అయ్యింది. ఆతర్వాత బిగ్ బాస్ విష్ణు ప్రియా, యష్మీల దగ్గరున్న సూట్ కేసును స్టోర్ రూమ్ లోపెట్టామన్నారు.
తీరా చూస్తే విష్ణు ప్రియా సూట్ కేసు కనిపించదు. అక్కడ ఏం జరిగింది అంటే గౌతమ్ అండ్ గ్యాంగ్ యష్మీ సూట్ కేసును కొట్టేశారు. అయితే విష్ణు ప్రియా సూట్ కేసును తనది అనుకోని యష్మీ ఓపెన్ చేసి చూసింది. తీరా దొరికిన సూట్ కేస్ ఓపెన్ చేసి చూడగా అందులో రూ.లక్ష 80 ఉన్నాయి. ఇదంతా చేసింది అవినాష్ అని అందరూ ఇరికించారు. ఇక అదే ససమయంలో విష్ణు ప్రియా పృథ్వీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పృథ్వీ నీతో మాట్లాడుతున్నాడు.. నాతో సరిగా మాట్లాడట్లేదు.. నాకు అయితే క్లారిటీ వచ్చేసిందిరా.. ఊరికే డంబ్ అని.. ఒక వ్యక్తిని హర్ట్ చేశాడని అతనికి ఐడియా ఉండి కూడా సారీ చెప్పట్లేదు.. అని విష్ణు ప్రియా అంది. తనని కూడా అలానే బాధ పెట్టాడని యష్మీ చెప్పుకుంది.
సారీ అడుగు అని పృథ్వీని యష్మీ కోరింది. నేను అడగను అని పృథ్వీ అంటాడు. నేను నిన్ను సారీ అడగలేదు అని విష్ణు అంటే..నేను నీకు చెప్పలేదు అని పృథ్వీ కౌంటర్ వేస్తాడు. అలా కాసేపు ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. టెన్షన్ పడి వేరే వాళ్లని తిడుతుంటాడు.. తరువాత కూల్ అవుతాడు.. అలాంటి వాడు నాకు వద్దు.. నాకు ఇష్టం అయితే గాజు బొమ్మలా చూసుకుంటా.. అని విష్ణు చెప్పుకొచ్చింది.మెగా చీఫ్ టాస్కులో రోహిణి, నబిల్‌ను ఎక్కువగా టార్గెట్ చేసినట్టు అనిపించింది. నబిల్ ఆ గ్యాంగులో జాయిన్ అయ్యాడు అని హరితేజ చెప్పడం చాలా విడ్డూరంగా కనిపించింది. ఆమె ఈ గ్యాంగులో ఉంటే.. నబిల్ ఆ గ్యాంగులో చేరాడు అని సెటైర్ వేస్తోంది. హరితేజ అసలు బిగ్ బాస్ ఇంటికి వచ్చి తప్పు చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంత వరకు ఆమెకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ ఇప్పుడు మెల్లిమెల్లిగా పోతోంది. ఇప్పటికే వచ్చిన లీకుల ప్రకారం ప్రేరణ మెగా చీఫ్ అయినట్టు తెలుస్తుంది.
Hyderabad : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిమితుల క్రింద…
KTR : హైదరాబాద్లో ఫార్ములా-ఇ రేసింగ్ ఈవెంట్ను నిర్వహించడంలో అవకతవకలు జరిగాయని, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్…
YS Jagan : ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు,…
Weight Loss : ప్రస్తుత కాలంలో స్థూలకాయ సమస్య పెద్ద ముప్పుగా మారుతుంది. అలాగే స్థూలకాయం అన్ని అనారోగ్య సమస్యలకు కారణం…
Winter : చలికాలం రానే వచ్చేసింది. అయితే ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం…
APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) వివిధ రకాల అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం…
Ants : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఎంతోమంది అంటూ ఉంటారు. అలాగే ఎంతమందికి అన్నదానం చేస్తే…
Pensioners : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వారి ప్రయోజనాలు అంతరాయం లేకుండా కొనసాగడానికి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని…
This website uses cookies.