Monalisa Bhosle : పుష్ప 2 పోస్టర్ ముందు మోనాలిసా ఫోజులు.. హీరోయిన్ అవ్వగానే లుక్కు మార్చేసిందిగా..!
Monalisa Bhosle : మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మోనాలిసా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె క్రేజ్ చూసి బాలీవుడ్ దర్శకుడు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఐతే హీరోయిన్ గా రీసెంట్ గా అగ్రిమెంట్ చేసుకున్న మోనాలిసా తన లుక్కు మార్చేసింది.
లేటెస్ట్ గా అమ్మడు పుష్ప 2 సినిమా పోస్టర్ ముందు క్రేజీ లుక్ తో కనిపించింది. పూసలు అమ్మే అమ్మాయేనా తను అనుకునేలా ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఆమె నటిస్తుంది.
Monalisa Bhosle న్యూ లుక్ లో మోనాలిసా..
మోనాలిసా యెల్లో కలర్ డ్రస్ పైన కోట్ వేసుకుని కంప్లీట్ హీరోయిన్ అప్పీల్ తో కనిపిస్తుంది. మొదటి ఛాన్స్ రావడమే తనలోని ఈ మార్పుని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక సినిమా కాస్త హిట్ అయితే మాత్రం అమ్మడు మరింత క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పుష్ప 2 పోస్టర్ ముందు మోనాలిసా ఉండటం తెలుగు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. చూస్తుంటే మోనాలిసా త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. Monalisa, Pushpa 2, The Dailry of Manipur, Maha kumbhmela, Heroine