Mega family silent on Sreeja Kalyan Dev divorce
Sreeja Kalyan Dev : సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. సౌత్ ఇండస్ట్రీ నుంచి మొదలయ్యి నార్త్ వరకు అంతటా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్- కిరణ్ రావు, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, – సమంతలు డైవోర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య, ధనుష్ విడాకుల వార్త వచ్చింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ- కల్యాణ్ దేవ్ కూడా విడిపోతున్నారని రూమర్స్ వస్తున్నాయి.
శ్రీజ- కల్యాణ్ దేవ్ విడిపోయారని, ఇప్పుడిద్దరు వేర్వేరుగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్‌లో శ్రీ జ తన ఐడీనీ శ్రీజ కల్యాణ్ నుంచి శ్రీజ కొణిదెల మార్చేసింది. దాంతో అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే కల్యాణ్ దేవ్ కూడా శ్రీజను అన్ ఫాలో చేశాడు. అది మరింత సంచలనమయింది. ఈ విషయమై సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తున్నది. అలా నెట్టింట రచ్చరచ్చ అవుతున్నది. ఇక శ్రీజ అకౌంట్ లో షేర్ అయిన ఫొటోల్లోనూ కల్యాణ్ దేవ్ ఫొటోలు కాకుండా మిగతా మెగా హీరోల ఫొటోలున్నాయి. దాంతో ఈ విషయమై విపరీతమైన డిస్కషన్ జరుగుతున్నది.
Mega family silent on Sreeja Kalyan Dev divorce
ఈ క్రమంలోనే కల్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’ సినిమా విడుదలైంది. కానీ, ఈ చిత్ర ప్రమోషనల్ యాక్టివిటీస్ లో మెగా హీరోలు ఎవ్వరొక్కరు కనబడలేదు. కల్యాణ్ దేవ్ కూడా మెగా హీరోల ఫంక్షన్లలో ఎక్కడా కనబడుట లేదు. దాంతో నిజంగానే శ్రీజ-కల్యాణ్ దేవ్ విడిపోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కల్యాణ్ దేవ్-శ్రీజల వివాహం 2016లో జరిగింది. వీరికి ఓ పాప సంతానం. పాప పేరు నవిష్క. అయితే, వీరిరువురి డైవోర్స్ గురించి వస్తున్న వార్తలపైన మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించడం లేదు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.