SKN : ఒక్క ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ కి టార్గెట్ అయిన బేబీ నిర్మాత.. పిసుక్కోవడమే అని పెట్టి..!
ప్రధానాంశాలు:
SKN : ఒక్క ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ కి టార్గెట్ అయిన బేబీ నిర్మాత.. పిసుక్కోవడమే అని పెట్టి..!
SKN : మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలపై నిర్మాత ఎస్.కె.ఎన్ మధ్య వర్తిగా ఉంటూ కొన్ని విషయాలను చెబుతూ వచ్చే వారు. అల్లు ఫ్యామిలీకి దగ్గర వాడైన ఎస్.కె.ఎన్ అల్లు అరవింద్ ఆధ్వర్యంలో సినిమాలు నిర్మిస్తుంటాడు. ఐతే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఎస్.కె.ఎన్ కొన్నిసార్లు ఎవరికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉంటాడు. పుష్ప 2 పై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ఎటాక్ తెలిసిందే. అయితే ముందు నుంచి ఈ వ్యవహారం పై ఎస్.కె.ఎన్ సైలెంట్ గా ఉన్నాడు. ఐతే పుష్ప 2 సక్సెస్ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ కళ్యాణ్ బాబాయ్ కి థాంక్స్ చెప్పగానే వ్యవహారం సర్ధుమనిగిందని అనుకున్నారు. ఐతే మెగా కల్ట్ ఫ్యాన్స్ ఇంకా అల్లు అర్జున్ మీద ఫైర్ మీద ఉన్నారు. ఐతే అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ కొందరు వేరే పార్టీకి సంబందించిన వ్యక్తులు సోషల్ మీడియాలో గొడవలకు కారణమవుతున్నారు.
SKN అఆ సినిమా నుంచి ఒక వీడియో..
ఐతే ఈ మొత్తం వ్యవహారం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పడంతో ముగుస్తుందని అనుకున్నారు. మెగా ఫ్యాన్స్ కొంతమంది అల్లు అర్జున్ చెప్పిన స్పెషల్ థాంక్స్ ని యాక్సెప్ట్ చేశారు. ఐతే వీళ్ల మధ్య కావాలని గొడవలు పెట్టుకోవాలనుకునే వారు ఇక నుంచి పిసుక్కోవడమే అంటూ ఎస్.కె.ఎన్ అఆ సినిమా నుంచి ఒక వీడియో పెట్టాడు. అంటే ఆ ఫ్యామిలీ మధ్య ఎవరు ఎలా ఎన్ని విధాలుగా దూరం పెంచాలని చూసినా అది జరగదు అని చెప్పేలా ఎస్.కె.ఎన్ ట్వీట్ ఉంది.
దీన్ని ఉదహరిస్తూనే ఎస్.కె.ఎన్ పిసుక్కోవడమే అన్నది వేశాడు. ఐతే ఎస్.కె.ఎన్ వేసిన వీడియోని మెగా ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి వేసినట్టుగా ఉందని భావిస్తున్నారు. మరి ఆయన నిజంగ అలా చేస్తాడా లేదా అన్నది చూడాలి. మెగా ఫ్యాన్ అయిన ఎస్.కె.ఎన్ వాళ్లని టార్గెట్ చేస్తాడని అనుకునే అవకాశం లేదు. మరి ఈ విషయం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. SKN, Allu Arjun, Pushpa 2, Mega Fans, Pisukkovadame, Tollywood ,
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 7, 2024