Allu Arjun : అల్లు అర్జున్‌ ను మళ్లీ టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :18 August 2022,4:40 pm

Allu Arjun : మెగా హీరోల్లో అల్లు అర్జున్‌ శైలి వేరు అన్నట్లుగా ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆయన తీరు ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా ఉంటుంది. మరో వైపు ఆయన మెగా కాంపౌండ్ హీరో అనిపించుకునేందుకు ఆసక్తి చూపరు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. రామ్‌ చరణ్ తో ఎప్పటికప్పుడు కోల్డ్‌ వార్‌ నడుపుతూ ఉండే అల్లు అర్జున్‌ ఈసారి మెగాస్టార్‌ చిరంజీవిని టార్గెట్‌ చేసిన వారికి మద్దతుగా నిలిచి మరింత దుమారంను రేపిన విషయం తెల్సిందే.

బింబిసార సినిమా విడుదల సమయంలో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే వ్యవహారం సీరియస్ గా మారింది. కళ్యాణ్ రామ్‌ అభిమానులు ఆయన్ను మెగాస్టార్ అంటూ సంబోధిస్తూ ఉన్న సమయంలో వెళ్లి కళ్యాణ్ రామ్‌ కి మద్దతు తెలపడం.. బింబిసార సినిమాకు ప్రశంసలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి విడ్డూరం అంటూ ఆ సమయంలోనే అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ టార్గెట్‌ చేశారు. తాజాగా మరోసారి అల్లు అర్జున్‌ పై విమర్శల వర్షం ను కురిపిస్తూ కొందరు అల్లు అర్జున్‌ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మెగా కాంపౌండ్‌ హీరోలు అంతా ఒక్క మాటపై ఉండకుండా అయ్యిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

mega fans fire on Allu Arjun and his movies

mega fans fire on Allu Arjun and his movies

అల్లు అర్జున్‌ తీరు ను మరోసారి ట్విట్టర్ ద్వారా మెగా అభిమానులు తప్పబడుతున్నారు. బన్నీ ఇలాగే వ్యవహరిస్తే ఆయన పుష్ప 2 సినిమాను బ్యాన్‌ చేయాల్సి వస్తుంది అంటూ ఈ సందర్బంగా అభిమానులు హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ అభిమానులకు మరియు మెగా ఫ్యాన్స్ కి మద్య వైరం మెల్ల మెల్ల గా ముదురుతోంది. ఇది కనుక పెరిగి పెద్దది అయితే మెగా కాంపౌండ్ సినిమాలు విడుదల అయిన సమయంలో రచ్చ జరగడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి