Pradeep Machiraju : మొత్తానికి ఓపెన్ అయిన యాంకర్ ప్రదీప్.. ప్రేమ విషయాన్ని స్టేజ్ మీదే చెప్పేశాడుగా

Authored By aruna | The Telugu News | Published on: August 18, 2022, 4:20 pm

Pradeep Machiraju : యాంకర్ ప్రదీప్ గురించి గత కొన్నేళ్లుగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆయన ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అవుతుంటాయి. అప్పుడెప్పుడో ప్రదీప్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోవడం, అందులో ఓ అమ్మాయి కూడా కారులో ఉందని టాక్ రావడం, ఇలా ప్రదీప్ డేటింగ్, లవ్ స్టోరీల మీద ఎన్నెన్నో కథనాలు వస్తుంటాయి. ఇక ప్రదీప్ పెళ్లి గోల మాత్రం బుల్లితెరపై ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది వినిపిస్తూనే ఉంటుంది.పెళ్లి చూపులు అంటూ ప్రదీప్ పెళ్లి మీదే ఓషోను చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందో అందరూ అర్థం చేసుకోవచ్చు. అలా యాంకర్ ప్రదీప్ పెళ్లి అనే టాపిక్ ఏ షోలోనైనా సరే ఉంటుంది. ఇక వచ్చే గెస్టులంతా కూడా ప్రదీప్ పెళ్లి మీదే కౌంటర్లువేస్తుంటారు.

ప్రదీప్ మాత్రం తన పెళ్లి గోల వదిలేయండి మహా ప్రభో అంటూ దండం పెట్టేస్తుంటాడు. ప్రదీప్ మాత్రం తన పెళ్లి మీద ఎప్పుడూ కూడా నేరుగా స్పందించడు. చూస్తున్నాం.. చేసుకుంటాను.. ఈ ఏడాది వచ్చే ఏడాది అంటూ ఇలా మాట దాటేస్తుంటాడు. అయితే ప్రదీప్ మాత్రం ఎప్పుడూ కూడా తన ప్రేమ, పెళ్లి విషయాల మీద నేరుగా ఓపెన్ కాలేదు. కానీ ఇప్పుడు స్టేజ్ మీద ఓపెన్ అయ్యాడు. తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో ఆది, ఇతర కంటెస్టెంట్లు ఇలా అందరూ కూడా తమ తమ లవ్ స్టోరీలను చెప్పుకొచ్చాడు. అఖిల్ కూడా తనకు అలవాటైన లవ్ స్టోరీలను చెప్పుకొచ్చాడు.

Anchor Pradeep Open on Love in Latest Dhee Promo

Anchor Pradeep Open on Love in Latest Dhee Promo

Pradeep Machiraju : సిగ్గు పడిపోయిన ప్రదీప్..

ఇందులో ప్రదీప్ కూడా తన ప్రేమను బయటపెట్టినట్టు కనిపిస్తోంది. చాలా చాలా మెమోరబుల్ నాకు.. మోస్ట్ బ్యూటీఫుల్ డే.. ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు.. అంటూ ఇలా ప్రదీప్ చెప్పుకుంటూ తెగ సిగ్గు పడిపోయాడు. ప్రోమోలో చూస్తుంటే మాత్రం ప్రదీప్ తన ప్రేమ గురించి చెప్పినట్టు అనిపిస్తోంది. తీరా ఎపిసోడ్‌లో చూస్తే మ్యాటర్ అదే ఉంటుందో లేదో చూడాలి. లేదంటే ఎప్పటిలానే జనాలు బక్రాలు చేసేస్తారో ఏమో. అఖిల్ మాత్రం తన లవ్ స్టోరీని బయటపెట్టేశాడు. ఆదికి స్కూల్ ఏజ్‌లో లవ్ స్టోరి ఉందని ఇది వరకే ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. మరి ప్రదీప్ మ్యాటర్ మాత్రమే ఇంకా సస్పెన్స్ ‌గా ఉంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp