Allu Aravind : రామ్ చరణ్ సినిమాపై అల్లు అరవింద్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్..!
ప్రధానాంశాలు:
Allu Aravind : రామ్ చరణ్ సినిమాపై అల్లు అరవింద్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్..!
Allu Aravind : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాపై రీసెంట్ గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దిల్ రాజు గురించి మాట్లాడుతూ ఈయన ఈ మధ్య చేసిన రెండు సినిమాలు ఒకటి ఇక్కడ మరొకటి అక్కడ నిలబెట్టాయి.. ఈ హంగామాతో ఐటీ వాళ్లను కూడా ఇన్వైట్ చేశాడంటూ అల్లు అరవింద్ మాట్లాడాడు.ఐతే ఒకటి ఇక్కడ అంటూ అల్లు అరవింద్ చెప్పింది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గురించే అని తెలిసిందే. అందుకే మెగా ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అరవింద్ మీద ఫైర్ అవుతున్నారు. ఐతే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఫలితం పై అతన్ని ఒక్కడినే టార్గెట్ చేయడం అంతగా బాగాలేదు. సినిమా చూసిన కామన్ ఆడియన్స్ బాగానే ఉందనే చెబుతున్నారు. ఐతే సినిమా అంచనాలను అందుకోలేదు కాబట్టి ఈ సినిమాను కొందరు యాంటీ ఫ్యాన్స్ చీల్చి చెండాడాడు.
Allu Aravind : మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎటాక్..
ఐతే రామ్ చరణ్ సినిమాపై అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కి రివర్స్ లో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎటాక్ చేస్తున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం ఇంకా పెరిగేలా ఇవి తోడ్పడుతున్నాయి. ఐతే అల్లు అరవింద్ కావాలని చరణ్ సినిమా కాబట్టి అలా అన్నాడా లేదా క్యాజువల్ గా అన్నాడా అన్నది ఆయనకే తెలియాలి.
పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవ్వడం ఆ తర్వాత వచ్చిన చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవ్వడం ఈ ఫ్యాన్ వార్ మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. ఏది ఏమైనా అభిమానుల మధ్య ఈ కొట్లాట హెల్దీ అట్మాస్పియర్ ని దెబ్బ తీస్తుందని చెప్పొచ్చు. మరి అల్లు మెగా ఫైట్ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న తండేల్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. Mega Fans, Allu Aravind, Ram Charan, Game Changer
సాధారణంగా ఇండస్ట్రీ లో సినీ పెద్దలు ఒక సినిమా ఫ్లాప్ అయితే దాని గురించి ఫ్లాప్ అని రిఫర్ చెయ్యరు. ముఖ్యంగా పక్కన వాళ్ళ సినిమా ఫ్లాప్ అయితే దాని గురించి మాట్లాడ్డం స్కిప్ చేస్తారు .. సైలెంట్ గా ఉంటారు..
కానీ అల్లు అరవింద్ గారు నిన్న ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ రామ్ చరణ్ సినిమా… pic.twitter.com/BZRRUT2ZGr
— Telugu360 (@Telugu360) February 4, 2025