Mega Family : మెగా ఫ్యామిలీలో మోగ‌నున్న పెళ్లి బాజా.. ఎవ‌రిదో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: September 7, 2022, 11:30 am

Mega Family : సినిమా ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ ఒక‌టి. ఆ సినిమా ప‌రిశ్ర‌మ నుండి వచ్చిన హీరోలు అంద‌రు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు. అయితే ప్ర‌స్తుతం కెరీర్ ఊపందుకుంటున్న స‌మయంలో కొంద‌రు మెగా హీరోలు పెళ్లికి సిద్ధం అయ్యార‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల‌లో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ ఈ ముగ్గురు పెళ్లికి సిద్దంగా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఇంట్లో గత కొన్ని నెలలుగా వారి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Mega Family : పెళ్లెప్పుడు..

వరుణ్ తేజ్ పెళ్లి గురించి మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. తన ఇష్టం.. తను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే పెళ్లి చేస్తానని ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ మదర్ కూడా గత కొన్ని నెలలుగా తనకు వివాహం చేయాలని ఆలోచిస్తున్నారు. త్వరలో ఈ ఇద్దరు బావ బావ మరుదుల్లో ఎవరు పెళ్లి వార్త చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు ప్రస్తుతం తమ తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా వున్నారు. సాయి ధరమ్ తేజ్ ఓ మిస్టిక్ థ్రిల్లర్ లో నటిస్తుండగా వరుణ్ తేజ్ త్వరలో ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు.

Mega Hero marraige In mega family news viral

Mega Hero marraige In mega family news viral

ఇక ఈ ఇద్దరి కంటే పెద్దవాడైన అల్లు శిరీష్ పెళ్లి వార్తలు మాత్రం ఇంకా వినిపించడం లేదు. ప్రస్తుతం శిరీష్ `ప్రేమ కాదంట` మూవీలో నటిస్తున్నాడు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌నే టాక్ కూడా న‌డుస్తుంది. మ‌రి ఈ ముగ్గురు హీరోల‌లో ఎవ‌రు ముందుగా పెళ్లి చేసుకోబోతున్నార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. ఇక మెగా ఫ్యామిలీ కాకుండా సందీప్ కిషన్, హీరో రామ్, అడివి శేష్ వంటి వారు కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp