Kriti shetty : కృతి శెట్టి ..తన మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కు ముందే క్రేజీ హీరోయిన్ గా అదరగొడుతోంది. తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఫిదా చేస్తోంది. ఏటా ఎందరో కొత్త హీరోయిన్ లు తెలుగు తెరకు పరిచయం అవుతుంటారు. కానీ అందులో కొందరిని మాత్రమే అభిమానులు ఆదరిస్తుంటారు. అందులో ఒకరు బెంగుళూరు ముద్దుగుమ్మ కృతిశెట్టి. బుచ్చిబాబు దర్శకుడిగా ఈ నెల 12న తెరకెక్కుతున్నఈ సినిమాతో తెలుగు తెరకు తొలిసారిగా పరిచయం అవుతోంది కృతి. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్న కృతి అనుకోకుండా వచ్చిన ఆఫర్ తో నటన మీద ఉన్న ఆసక్తితో యాక్టర్ గా సినీ రంగప్రవేశం చేస్తోంది. ఉప్పెన సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కానీ కరోనా కారణంగా పెండింగ్ లో పడింది. అప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. నీ కళ్లు నీలి సముద్రం పాట కృతి శెట్టికి ఎంత పేరును తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఓ 16 ఏళ్ల టీనేజర్ అయిన కృతి సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యింది. కృతి క్యూట్ లుక్స్ కు యువకులు కనెక్ట్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటంతో మూవీపైన ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. ఉప్పెనలో బేబమ్మ పాత్రను పోషిస్తోంది కృతి. బేబమ్మ ఓ బబ్లీ అమ్మాయి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో కృతి ఒదిగిపోయింది. ప్రేమ కథా చిత్రం కావడంతో ఎన్నో భావోద్వేగభరితమైన సన్నివేశాల్లోనూ అమ్మడు నటించి చిత్ర యూనిట్ ను మెప్పించిందట . బేబమ్మ పాత్రలో నటించినంత సేపూ ఎక్కడా నటిస్తున్నట్లు అనిపించలేదట. కృతి అంతలా పాత్రలో ఒదిగిపోయిందని టాక్. దీంతో ఇప్పుడు మెగా హీరోల కన్ను కృతిపై పడిందట.
ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయినట్టే అని ఇండస్ట్రీ టాక్ . మెగా హీరోల సినిమాలు లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ తో పాటు మరోసారి వైష్ణవ్ తో నటించబోతోందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఇండస్ట్రీలోని యువ హీరోలు కృతినే కావాలంటున్నారట. దీంతో క్రేజీ ఆఫర్లు అమ్మడి తలుపు తడుతున్నాయట. ఇప్పటికే నాని శ్యాం సింగ్ రాయ్ లో ఆఫర్ కొట్టేసింది ఈ క్యూటీ. సుధీర్ బాబు సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది. లేటెస్ట్ గా అఖిల్ తోనూ జోడీ కట్టనుందన్నట్లు తెలుస్తోంది. మరోపక్క నాగ శౌర్య సినిమాలోనూ కృతి పేరు వినిపిస్తోంది. ఇంకా తెరమీద బొమ్మ పడేలేదు..కానీ కృతికి ఆఫర్ల వర్షం కురుస్తోంది…చూడాలి మరి మొదటి సినిమా ఉప్పెన ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.