Chiranjeevi: ఈ నెల ( ఆగస్ట్ 22 ) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. అన్నయ్య బర్త్ డే వస్తుందంటే ఇండస్ట్రీ వర్గాలలో, మెగా అభిమానుల్లో ఉండే ఆరాటం, ఉత్సాహం ఏపాటిదో అందరికీ తెలిసిందే. గతంలో చిరు ప్రతీ బర్త్ డే ఓ ప్రత్యేకమైన ప్లేస్‌లో అభిమానుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకునేవారు. కానీ కొన్ని ఏళ్ళుగా అలా కుదరడం లేదు. ఇక గత రెండేళ్ళుగా కరోనా కారణంగా మెగా సెలబ్రేషన్స్ జరగడం లేదు. అయితే ఈసారి మెగాస్టార్ బర్త్ డే సంబరాలు చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అందుకు వేదిక వైజాగ్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఇక ఆయన నటిస్తున్న సినిమాలకి సంబంధించిన సర్‌ప్రైజెస్ కూడా ప్లాన్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సర్‌ప్రైజెస్ రాబోతున్నాయట. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా నుంచి కొత్త పోస్టర్‌తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసే అవకాశం ఉందట. ఇందులో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ కూడా నటిస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. కాజల్ అగరాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటించారు.
ఇక ఇటీవల ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్ మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ని మొదలు పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖరారు చేశారు. అఫీషియల్‌గా బర్త్ డే రోజు ప్రకటించనున్నారు. ఇక ఇందులో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని.. నయనతార, సత్యదేవ్ ఇప్పటికే కంఫర్మ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అప్డేట్ కూడా ఆ రోజు ఉంటుందట.
ఇక దర్శకుడు మెహెర్ రమేష్ తో మెగాస్టార్ నటించనున్న సినిమా గురించి కూడా అప్‌డేట్ రానుందట. తమిళంలో హిట్టైన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవికి చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ నుంచి కూడా ఓ అప్డేట్ రానుంది. అలాగే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కూడా రాబోతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.