Chiranjeevi : మెగాస్టార్ బర్త్ డేకి బ్యాక్ టు బ్యాక్ నాలుగు సర్‌ప్రైజెస్..మెగా ఫ్యాన్స్ సంబరాలకి రెడీ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chiranjeevi : మెగాస్టార్ బర్త్ డేకి బ్యాక్ టు బ్యాక్ నాలుగు సర్‌ప్రైజెస్..మెగా ఫ్యాన్స్ సంబరాలకి రెడీ

Chiranjeevi: ఈ నెల ( ఆగస్ట్ 22 ) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. అన్నయ్య బర్త్ డే వస్తుందంటే ఇండస్ట్రీ వర్గాలలో, మెగా అభిమానుల్లో ఉండే ఆరాటం, ఉత్సాహం ఏపాటిదో అందరికీ తెలిసిందే. గతంలో చిరు ప్రతీ బర్త్ డే ఓ ప్రత్యేకమైన ప్లేస్‌లో అభిమానుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకునేవారు. కానీ కొన్ని ఏళ్ళుగా అలా కుదరడం లేదు. ఇక గత రెండేళ్ళుగా కరోనా కారణంగా మెగా సెలబ్రేషన్స్ జరగడం లేదు. అయితే ఈసారి […]

 Authored By govind | The Telugu News | Updated on :21 August 2021,6:30 am

Chiranjeevi: ఈ నెల ( ఆగస్ట్ 22 ) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. అన్నయ్య బర్త్ డే వస్తుందంటే ఇండస్ట్రీ వర్గాలలో, మెగా అభిమానుల్లో ఉండే ఆరాటం, ఉత్సాహం ఏపాటిదో అందరికీ తెలిసిందే. గతంలో చిరు ప్రతీ బర్త్ డే ఓ ప్రత్యేకమైన ప్లేస్‌లో అభిమానుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకునేవారు. కానీ కొన్ని ఏళ్ళుగా అలా కుదరడం లేదు. ఇక గత రెండేళ్ళుగా కరోనా కారణంగా మెగా సెలబ్రేషన్స్ జరగడం లేదు. అయితే ఈసారి మెగాస్టార్ బర్త్ డే సంబరాలు చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అందుకు వేదిక వైజాగ్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి.

mega star chiranjeevi back to back four surprises on his birthday

mega-star chiranjeevi-back-to-back-four-surprises-on-his-birthday

ఇక ఆయన నటిస్తున్న సినిమాలకి సంబంధించిన సర్‌ప్రైజెస్ కూడా ప్లాన్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సర్‌ప్రైజెస్ రాబోతున్నాయట. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా నుంచి కొత్త పోస్టర్‌తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసే అవకాశం ఉందట. ఇందులో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ కూడా నటిస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. కాజల్ అగరాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటించారు.

Chiranjeevi: గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖరారు. అఫీషియల్‌గా బర్త్ డే రోజు ప్రకటించనున్నారు.

Chiranjeevi

Chiranjeevi

ఇక ఇటీవల ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్ మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ని మొదలు పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖరారు చేశారు. అఫీషియల్‌గా బర్త్ డే రోజు ప్రకటించనున్నారు. ఇక ఇందులో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని.. నయనతార, సత్యదేవ్ ఇప్పటికే కంఫర్మ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అప్డేట్ కూడా ఆ రోజు ఉంటుందట.

 

Chiranjeevi

Chiranjeevi

ఇక దర్శకుడు మెహెర్ రమేష్ తో మెగాస్టార్ నటించనున్న సినిమా గురించి కూడా అప్‌డేట్ రానుందట. తమిళంలో హిట్టైన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవికి చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ నుంచి కూడా ఓ అప్డేట్ రానుంది. అలాగే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కూడా రాబోతోంది.

 

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది