Anchor Suma : ఇది యాంకర్ సుమ స్థాయి… చిరంజీవి పిలిచి మరీ ఫోటో దిగాడు, ఎందుకో తెలుసా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 31 March 2022, 10:00 pm

Anchor Suma : వెండితెర – బుల్లితెర ఈ రెండు స్క్రీన్ కి సమన్వయ కర్తగా యాంకర్ సుమ వ్యవహరిస్తున్నారు అనడంలో సందేహం లేదు. వెండి తెర కు సంబంధించిన సినిమాలను కార్యక్రమాలను బుల్లి తెర ప్రేక్షకులకు చేరువ చేసేందుకు యాంకర్ సుమ తనదైన ముద్ర వేసి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తాప్సి ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి హాజరైన సమయంలో కచ్చితంగా ఆ షో కి మరెవ్వరూ యాంకర్ గా వ్యవహరించే సాహసం చెయ్యరు అని చెప్పాలి. ఒకవేళ చేయాలి అనుకున్న నిర్వాహకులు ఏ ఒక్కరికి అవకాశం ఇయ్యరు. ఆ అవకాశం కేవలం సుమ కు మాత్రమే ఇస్తారు.

పెద్ద హీరోల సినిమాలు వారు పాల్గొని కార్యక్రమాల్లో సుమ అయితేనే ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదు. వారి స్థాయిలో మాట్లాడగలదు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అందుకే మిషన్ ఇంపాజిబుల్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ యాంకరింగ్ చేసింది. కార్యక్రమం అంతా పూర్తి అయిన తర్వాత కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగించాల్సి ఉండగా.. ఆ సమయంలో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన దగ్గరికి సుమను పిలుచుకుని ఆమె దగ్గర ఉన్న లాగేసుకుని, ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. కేవలం సుమను మాత్రమే కాదు.. తాను ఆమె పక్కన నిలబడి ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

megastar chiranjeevi about anchor suma

megastar chiranjeevi about anchor suma

మెగాస్టార్ చిరంజీవి తో కొన్ని కోట్ల మంది ఫోటోలు దిగాలని ఆశ పడుతుంటారు. అలాంటిది సుమ కు ఇలాంటి అవకాశం రావడం అది కూడా స్వయంగా చిరంజీవి పిలిచి ఆమెతో ఫోటో దిగాలి అనుకోవడం విడ్డూరంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఎంతో మందికి నేను అభిమాన హీరో అయ్యి ఉండి ఉండొచ్చు.. కానీ నేను మాత్రం సుమకు అభిమానిని.. ఆమె వాక్చాతుర్యానికి అభిమానిని అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో సుమ స్థాయి ఏంటో తేలిపోయింది. ఖచ్చితంగా సుమ ఫొటోలు దిగడానికి అర్హురాలు అంటూ ఆమె పక్కన నిల్చుని మరి ఫోటోలు దిగిన చిరంజీవి చాలా గొప్పవాడు. అంతటి గొప్ప వారి నుండి ప్రశంసలు దక్కించుకుంది కనుక సుమ కూడా గొప్ప వ్యక్తి అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి