Chiranjeevi : క్లారిటి : చిరంజీవి ఆ ‘తప్పు’ చెయ్యట్లేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : క్లారిటి : చిరంజీవి ఆ ‘తప్పు’ చెయ్యట్లేదు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :10 May 2023,7:00 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ల వయసు దాటినా ఇంకా యువ హీరోలా సినిమాలు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఆయన. ఇప్పటికీ యంగ్ హీరోలు వేయలేని డ్యాన్స్ స్టెప్పులు వేసి అదరగొట్టేస్తున్నారు. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్యలో చిరు ఇరగదీశారనే చెప్పుకోవాలి. గత సంవత్సరం రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి వాల్తేరు వీరయ్య కాగా మరొకటి గాడ్ పాదర్. ఆ సినిమా నిజానికి ఒక రీమేక్.

megastar chiranjeevi gives clarity on remake

megastar chiranjeevi gives clarity on remake

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా రీమేకే. ఆ సినిమా మలయాళం సినిమా రీమేక్. భోలా శంకర్ సినిమా తర్వాత కూడా మరో మలయాళం సినిమాకు చిరంజీవి రీమేక్ చేయనున్నారట. అన్నీ రీమేక్ ల మీద పడటంతో చిరంజీవి ఎందుకు మలయాళం సినిమాలపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు కానీ.. భోలా శంకర్ తర్వాత చిరంజీవి బ్రో డాడీ అనే సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదని మెగా పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.

Godfather: Chiranjeevi made the right choice! - The South First

Chiranjeevi : ఆ సినిమాకు సంబంధించి ఇంకా చర్చలు జరగలేదన్న టీమ్

ఇంకా బ్రో డాడీ సినిమాను రీమేక్ చేయడానికి సంబంధించిన చర్చలు జరగలేదని మెగా పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఆ రీమేక్ కు సంబంధించిన చర్చలు జరగలేదని.. భోలా శంకర్ సినిమా తర్వాతనే దానిపై క్లారిటీ వస్తుందని తెలిపింది. భోలా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు చిరంజీవి సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ కథ ఓకే అయితే ఇప్పటి వరకు చిరంజీవిని చూడని విభిన్నమైన పాత్రలో చిరంజీవిని చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భోళా శంకర్ షూటింగ్ పూర్తి కాగానే ఆ సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. బ్రో డాడీ సినిమా రీమేక్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది